దాసరికి ఆ సంవత్సరం ఎదురుదెబ్బ వరుసగా ఈ మూడు సినిమాలు.!!

దర్శకరత్న దాసరి నారాయణరావు ఈ పేరు వినగానే సినీ పరిశ్రమలో ఆదరణ అభిమానానికి కొదవుండదు. “తాతా మనవడు” చిత్రంతో ప్రారంభమైన దర్శకరత్న దాసరి నారాయణరావు ప్రయాణం ఎన్నో శిఖరాలను అధిరోహిస్తూ.. ఉన్నత స్థాయికి చేరుకున్నారు. పెద్ద నటులతో సినిమా తీయాలన్న, చిన్న సినిమాలకు ఆదరణ పెంచాలన్న దాసరితోనే సాధ్యమయింది.

ఎన్టీఆర్ తో సర్దార్ పాపారాయుడు, బొబ్బిలి పులిలాంటి కమర్షియల్ చిత్రాలను దాసరి రూపొందించారు. అక్కినేనితో శ్రీవారి ముచ్చట్లు, ప్రేమాభిషేకం లాంటి ప్రేమ కుటుంబ పరమైన ఇతివృత్తాలతో కూడిన చిత్రాలకు దర్శకత్వం వహించారు.

1980 దశకం చివరి చరమాంకంలో దాసరి సినీ ప్రయాణం కొంత ఒడిదొడుకులకు గురైందని చెప్పవచ్చు. 1989 ప్రథమార్థంలో పద్మాలయా స్టూడియోస్, దాసరి దర్శకత్వంలో హీరో కృష్ణ కొడుకు రమేష్ బాబు, భానుప్రియ హీరో, హీరోయిన్లుగా “బ్లాక్ టైగర్” చిత్రంలో నటించారు. దాసరి నారాయణ రావు అనగానే సినిమా పై మంచి అంచనాలు నెలకొన్నాయి. కానీ సినిమా ఒక డిజాస్టర్ గా మిగిలిపోయింది.

ఆయన సినీ ప్రయాణంలో చిరంజీవితో సినిమా తీయడం చాలా ఆలస్యం అయిందని చెప్పవచ్చు. అలా చిరంజీవి హీరోగా వడ్డే రమేష్ నిర్మాణం, దాసరి దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ‘లంకేశ్వరుడు’ చిత్రం దసరా కానుకగా భారీ అంచనాలతో విడుదలైంది. కానీ సినిమా అపజయం పొందింది. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఈ ఫెయిల్యూర్ భవిష్యత్తులో మరో సినిమాను రూపొందించకుండా చేసిందని చెప్పవచ్చు.

ఆ తర్వాత రెండు నెలల వ్యవధిలో హిందీ సినిమా తేజాబ్ ను రిమేక్ చేస్తూ.. వెంకట రాజు నిర్మాణం దాసరి దర్శకత్వంలో వచ్చిన “టూటౌన్ రౌడీ” చిత్రంలో వెంకటేష్, రాధా హీరో,హీరోయిన్లుగా నటించారు. బాలీవుడ్ లో వచ్చిన “తేజాబ్” చిత్రంలో అనిల్ కపూర్ మాధురి దీక్షిత్ హీరోయిన్లుగా నటించారు. 1988 నవంబర్ లో విడుదలైన ఈ చిత్రం అద్భుత విజయాన్ని సాధించింది. కానీ ఈ చిత్రాన్ని రీమేక్ చేస్తూ తెలుగులో తీసిన టూటౌన్ రౌడీ మాత్రం పరాజయం పొందింది.

1989లో బ్లాక్ టైగర్, లంకేశ్వరుడు, టూటౌన్ రౌడీ ఈ మూడు చిత్రాలు వరుసగా అపజయం పొందడంతో దాసరి నారాయణరావు “సినీకెరీర్” గ్రాఫ్ చాలా వరకు తగ్గింది. ఆ తర్వాత చిన్న చిత్రాల వైపు మొగ్గు చూపడం జరిగింది. ఒరేయ్ రిక్షా, ఒసేయ్ రాములమ్మ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలకు దర్శకత్వం వహించి దాసరి నారాయణరావు తన ఉనికిని చాటుకున్నారు.