సినిమా ఇండస్ట్రీలో వారసత్వాన్ని తీసుకురావాలని, వారిని ఏదో ఒక విభాగంలో నిలబెట్టాలని ఇండస్ట్రీలో ఉన్న ప్రతీ పెద్ద దర్శక, నిర్మాతలు, హీరోలు, సినిమాటోగ్రాఫర్లు, హీరోయిన్లు ఆశపడుతుంటారు. ఆ రకంగా అన్నీ రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. సీనియర్ దర్శకులు, నిర్మాతలు.. హీరోలు తమ సంతానాన్ని హీరోలుగానో, హీరోయిస్ గానో ఎంటరయి స్టార్ హోదా దక్కితే చూడాలని కోరుకుంటారు. అయితే కొందరి విషయంలో ఎంత గ్రాండ్ గా ఇండస్ట్రీలో లాంచ్ చేసిన అడ్రస్ లేకుండా పోతారు. స్టార్ కిడ్స్ అయినా కూడా వాళ్ళ తల్లిదండ్రుల స్టార్ స్టేటస్ ప్రభావం కేవలం మొదటి సినిమాకే పని చేస్తుంది.
రెండవ సినిమా నుంచి తెడ్డు సొంతగా వేసుకోవాల్సిందే. పడవను నడపాల్సిందే. ఇండస్ట్రీలో అగ్ర దర్శకులుగా, నిర్మాతలుగా వెలిగిన వారి కొడుకులు మాత్రం నిలదొక్కుకోలేకపోయారు. అలాంటి వారిలో దర్శకరత్న దాసరి నారాయణరావు తనయుడు దాసరి అరుణ్ కుమార్ కూడా ఉన్నాడు. దాసరి గారు దర్శకులను, హీరోలను ఎంతో మందిని తీసుకు వచ్చి స్టార్స్ ని చేశారు. కోడి రామకృష్ణ, రేలంగి నరసింహా రావు లాంటి వారు దాసరి శిష్యులే. వీరు ఇండస్ట్రీలో అగ్ర దర్శకులుగా వెలిగారు. ఇక మంచు మోహన్ బాబుని ఈ స్థాయికి తీసుకు వచ్చిన దర్శకులు దాసరి గారే.
కలెక్షన్ కింగ్ గా, డైలాగ్ కింగ్ గా మోహన్ బాబు స్టార్ స్టేటస్ సాధించి నిర్మాణ రంగంలోనూ సక్సెస్ అయ్యారంటే అదంతా దాసరి నారాయణ గారి ప్రోద్భలమే. ఇంతమందికి స్టార్ ఇమేజ్ తెచ్చిపెట్టిన దాసరి గారు..తన కొడుకుకి మాత్రం అది చేయలేకపోయారు. ఇండస్ట్రీలోకి అయితే తీసుకు వచ్చారు గానీ హీరోగా నిలబెట్టలేకపోయారు. కొన్ని సినిమాలు చేసిన అరుణ్ కుమార్ పెద్ద హీరో కాలేకపోయారు. దర్శకత్వ విభాగంలో పనిచేసి పెద్ద దర్శకుడు కాలేకపోయాడు అరుణ్ కుమార్. ఇక ఆయా చేసిన సినిమాలలో అంతగా ఆయనకి పేరు తెచ్చినవి కూడా ఏవీ లేవు. ఇంకా చెప్పాలంటే దాసరి అరుణ్ కుమార్ నటించిన సినిమాలేవీ అంటే ఠక్కున గుర్తొచ్చేవి కూడా లేకపోవడం ఆశ్చర్యకరం.
ఇదే తీరని కోరికగా దాసరి నారాయాణ రావుగారికి ఉండిపోయింది. ఎన్నో సందర్భాలలో దాసరి గారు ఆయన సన్నిహితుల వద్ద ఈ విషయం ప్రస్తావించి బాధపడ్డారు కూడా. ఇంతమందికి లైఫ్ ఇచ్చాను.. ఇండస్ట్రీలో నా కొడుకుని మాత్రం హీరోగా నిలబెట్టలేకపోయానని తీవ్రంగా బాధపడ్డారట. ఎప్పటికైనా తన కొడుకు పెద్ద హీరో అయితే చూడాలని కోరిక బలంగా ఉండేది. కానీ ఆ కోరిక తీరకుండానే ఆయన అనంతలోకాలకి వెళ్ళిపోయారు. ప్రస్తుతం దాసరి అరుణ్ కుమార్ ఏవో వ్యాపారాలు చేసుకుంటున్నట్టు సమాచారం. మరి రానున్న రోజుల్లో అయినా సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా గానీ, నటుడుగా గానీ పాపులారిటీ తెచ్చుకుంటాడేమో చూడాలి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…