Categories: FeaturedMovie News

ప్రాణాపాయం నుంచి బయటపడ్డ కత్తి మహేష్.. కానీ జీవితాంతం ఆలోపంతోనే ఉండాలంటున్న వైద్యులు..

సినీ క్రిటిక్ , న‌టుడు క‌త్తి మ‌హేష్ ఈనెల 26న ఘోర రోడ్డు ప్రమాదానికి గురయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కత్తి మహేష్ ప్రయాణిస్తున్న కారు నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చంద్రశేఖరపురం వద్ద లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఈ ప్రమాదంలో మహేష్ కు తీవ్ర గాయాలయ్యాయి. అయితే ఐసీయూ లో చికిత్స పొందుతున్న కత్తి మహేష్ ఆరోగ్యం పై ఇప్పటివరకు ప్రజలకు ఎటువంటి సమాచారం లేకపోవడంతో సోషల్ మీడియాలో ఆయన ఆరోగ్యంపై అనేక పుకార్లు మొదలయ్యాయి.

ఈ క్రమంలో కత్తి మహేష్ ఆరోగ్య పరిస్థితి గురించి హెల్త్ బులిటెన్ విడుదల చేసారు. ఈ ప్రమాదంలో కత్తి మహేష్ తలకు తీవ్ర గాయాలు అయ్యాయని, దీనితో ఆయన ప్రస్తుతం ఇసోలేషన్‌లో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారని వైద్యులు చెబుతున్నారు. ఆయనకు ప్రాణాపాయం మాత్రం లేదని.. కానీ తర్వాత మరిన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉందని వాటిని ఇప్పుడే చెప్పలేమని చెబుతున్నారు. ప్రస్తుతానికి అయన ఆరోగ్యం నిలకడగా ఉన్నా కూడా అయన శ్వాస తీసుకోవడంతో ఇబ్బంది పడుతున్నాడని తెలిపారు. ఈ ప్రమాదంలో కత్తి మహేష్ తో పాటు అయన డ్రైవర్ కూడా ఉన్నాడు. అయితే ఆ సమయంలో డ్రైవర్ సీట్ బెల్ట్ పెట్టుకోవడంతో అతనికి చిన్న గాయం కూడా తగలకుండా బయటపడ్డాడు. అయితే కత్తి మహేష్ సీట్ బెల్ట్ పెట్టుకోలేదని తెలుస్తుంది.

ఈ క్రమంలో ఇప్పటికే కత్తి మహేష్‌కు పలు సర్జరీలు పూర్తి చేసారు. మరికొన్ని సర్జరీలు కూడా జరగాల్సి ఉన్నాయి. ఇక కత్తి మహేష్‌కు ప్రాణాపాయం తప్పినా ఆయనలో ఒక లోపం మాత్రం జీవితాంతం ఉంటుందని చెబుతున్నారు. ఈ ప్రమాదంలో కత్తి మహేష్ ఎడమ కంటి చూపును పూర్తిగా కోల్పోయినట్టు ఆయన మేనమామ శ్రీరాములు మీడియాకు వెల్లడించారు. ఇక చూపు వచ్చే ఆస్కారం లేదని వైద్యులు చెప్పినట్టు అయన తెలిపారు. అయితే ప్రమాదంలో అయన ముక్కులో పలు ఎముకలు చిట్లాయని అందువల్ల ఆయనకు బోన్ రీ కన్స్ట్రక్షన్ జరుగుతోందని తెలిపారు. ఈ క్రమంలో కత్తి మహేష్ మామూలు మనిషి కావడానికి మాత్రం చాలా సమయం పడుతుందని తెలుస్తుంది. ఇక సోషల్ మీడియాలో ఈయన త్వరగా కోలుకోవాలని అభిమానులు, సన్నిహితులు కోరుకుంటున్నారు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago