Categories: Technology

మీ ఫేస్ బుక్ ప్రొఫైల్ ని ఎవరెవరు చూశారో ఇలా ఈజీగా తెలుసుకోవచ్చు!!

ఫేస్ బుక్ ఇప్పుడు నిత్య జీవితంలో భాగమైంది. బంధువులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులతో వ్యక్తిగత రిలేషన్ మెయింటెయిన్ చేసేటంతటి టైం బిజీ లైఫ్ కారణంగా దొరకడంలేదు. అందుకే మనకు సంబంధించిన ఎటువంటి విశేషమయినా, ఇంకా ఏదయినా ఎఫ్బీ వాల్ మీద పోస్టు చేస్తే సరి సెకన్లలో ప్రపంచానికి చేరిపోతోంది. అందుకే మన వ్యక్తిగత విషయాల సమాహారంగా ఫేస్ బుక్ మారిపోయింది. అంతటి ప్రాధాన్యత కలిగిన అకౌంట్ను మనకు సంబంధంలేని వ్యక్తులు, మన మీద కన్నేసి ఉంచిన వారు చూడడం వల్ల చాలా నష్టం జరుగుతుంది. మన ప్రొఫైల్ ని ఎవరు పడితే వారు ఓపెన్ చేసి ఏమేం పోస్టు చేశారో తెలుసుకునే సదుపాయం ఉండడం ప్రైవసీకి ప్రమాదకరమే. ఇక ఆకతాయిలు అమ్మాయిల ప్రొఫైల్స్ ఓపెన్ చేసి అందగా ఉన్న వారి ఇమేజ్ లు సేవ్ చేసుకోవడం, ఆ తర్వాత వాటిని దుర్వినియోగం చేయడం తెలిసిందే. కొంతమంది వాటిని మార్పింగ్ చేసి బ్లాక్మెయిల్ చేయడం కూడా మనం రోజూ ఎక్కడో ఓ చోట చూస్తూనే ఉన్నాం. అయితే మన ప్రొఫైల్ ను ఎవరు ఎవరూ ఓపెన్ చేశారో తెలుసుకోవచ్చు ఇలా..

టైంలైన్ పై రైట్ క్లిక్ ఇచ్చి వ్యూ పేజ్ సోర్స్(VIEW PAGE SOURCE) సెలక్ట్ చేయాలి. వెంటనే ఓ కోడింగ్ ఉన్న పేజీ తెరుచుకుంటుంది. జస్ట్ ఆ పేజీలో కంట్రోల్ ఎఫ్ నొక్కండి(CTRL+F) ఆ తర్వాత ఇన్షియల్ చాట్ ఫ్రెండ్స్ లిస్టు (InitialChatfriendsList) అని టైపు చేసి సెర్చ్ కొట్టాలి. ఆ కోడింగ్ పేజీలో ఈ అక్షరాలు సెలక్ట్ అయ్యాక యూజర్ ఐడీలు కనిపిస్తాయి. వెంటనే ఆ ఐడీలు కాపీచేసి ఫేస్ బుక్ లో సెర్చ్ చేసినా లేదా http://www.facebook.com/ తర్వాత యూజర్ ఐడీని నొక్కినా మీకు ఎవరెవరు మీ ఫేస్ బుక్ అకౌంట్ ని చూశారో తెలిసిపోతుంది. ఇక్కడ చెప్పిన అంశాలను దృశ్య రూపంలో మరింత వివరణాత్మకంగా తెలుసుకోవాలంటే కింది వీడియోను క్లిక్ చేయండి..

telugudesk

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago