Featured

మేము గ్లామర్ రోల్స్ చేయమన్నామా.. ఎక్స్‌ఫోజింగ్ చేయమన్నామా? : మాధవీ లత

తెలుగులో చక్కగా నటించగలిగే సత్తా ఉన్న యంగ్ హీరోయిన్ మాధవీ లత. మాధవీ లత అమ్మా నాన్న కర్ణాటక లోని బళ్ళారి. ఆమె 1988, అక్టోబరు 2న జన్మించింది. బాల్యం, చదువు బళ్ళారిలోనే సాగింది. ఎ.ఎస్.ఎం.మహిళా కళాశాలలో సోషియాలజీలో డిగ్రీ చేసింది. తరువాత గుల్బర్గా విశ్వవిద్యాలయం నుంచి ఆర్థిక శాస్త్రంలో ఆనర్స్ డిగ్రీ చేసింది. కన్నడ కుటుంబంలో పుట్టినా తెలుగు, తమిళ భాషలు ధారాళంగా మాట్లాడుతుంది. మాధవీ లతకి సినిమాల మీద చాలా ఆసక్తి ఉండేది. హీరోయిన్ అవ్వాలనే కోరిక తనలో బలంగా ఉండేది.

దాంతో టాలీవుడ్‌లోకి ఎంటరయిన మాదవీ లత కెరీర్ ప్రారంభంలో చిన్న చిన్న పాత్రలో నటించే అవకాశాలను అందుకుంది. అలా దర్శకుడు రవిబాబు కంట్లో పడటంతో, ఆయన 2008లో వచ్చిన నచ్చావులే సినిమా ద్వారా హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే.  తనీశ్ హీరోగా నటించిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాత రామోజీ రావు నిర్మించారు. ఈ సినిమా తర్వాత మాదవీ లతకి మంచి క్రేజ్ వచ్చింది. దాంతో తెలుగులో వరుసగా ఆఫర్స్ వస్తాయని అందరూ అనుకున్నారు. కానీ ఎందుకనో ఆమెకి ఆశించినంతగా అవకాశాలు దక్కలేదు.

ఈ సినిమా తర్వాత మాధవీ లత చెప్పుకోగదిన సినిమా అంటే నేచురల్ స్టార్ నానితో స్నేహితుడా. ఇందులో ఆమె కాస్త గ్లామర్ గాను కనిపించింది. కానీ ఈ సినిమా జనాలకి ఎక్కలేదు. అంతే మళ్ళీ పెద్ద సినిమా స్టార్ హీరోతో చేసే అవకాశాలు దక్కలేదు. అయితే మంచి పర్ఫార్మర్, అందంగా ఉంటుంది అని అందరూ చెప్పుకుంటారు. మరి ఇండస్ట్రీలో వారు ఎందుకు తనకి అవకాశాలివ్వడం లేదనేది ఇప్పటికీ చాలా మందికి అర్థం కాని ప్రశ్న. ఈ విషయంలో మాధవీ లత తన గొంతు కూడా వినిపించింది. నాకు ఎందుకు అవకాశాలివ్వడం లేదని పలు ఇంటర్వ్యూస్ లో వాపోయింది.

కానీ ఆమెని పట్టించుకున్న సినీ పెద్దలు లేరు. తన తర్వాత ఇండస్ట్రీకొచ్చి స్టార్స్ గా వెలుగుతున్న వారు.. మోస్ట్ వాంటెడ్ గా క్రేజ్ తెచ్చుకొని కోట్లలో రెమ్యునరేషన్ అందుకుంటున్న వారూ ఉన్నారు. ఏదైనా అంటే ఇక్కడ తెలుగమ్మాయిలను అంతగా ఎంకరేజ్ చేయరనేది వాదన. మాలో కూడా టాలెంట్ ఉంది. లేకపోతే నచ్చావులే ఎందుకు హిట్ అవుతుంది. అందరు నన్ను ఎందుకు అప్రిషియేట్ చేశారు. ఇక ఎక్స్‌ఫోజింగ్.. మాధవీ లత స్నేహితుడా సినిమాలో గ్లామర్ గా కనిపించలేదా.. దాన్ని ఎక్స్‌ఫోజింగ్ అనకుండా మరేమంటారు అని ప్రశ్నించిన సందర్భాలూ చాలా ఉన్నాయి.  

అయినా తనకి సరైన సమాధానం దొరికింది లేదు. 2013 లో “అరవింద్ 2” చేసింది. ఇందులోనూ మాధవీ లతకి బాగానే మార్కులు పడ్డాయి. ఇక “చూడాలని చెప్పాలని” సినిమాలో నటించింది. ఇందులో హీరో నందమూరి తారకరత్న. ఇందులో తను మూగ, చెవుడు ఉన్న అమ్మాయిగా నటించి ఆకట్టుకుంది. కానీ అనుకున్న అవకాశాలు మాత్రం దక్కలేదు. విచిత్రం ఏమిటంటే గత రెండేళ్ళుగా కరోనా ఇండస్ట్రీని కొట్టిన దెబ్బకి ఓటీటీ ప్లాట్ ఫాంస్ కి బాగా డిమాండ్ పెరిగింది. సమంత, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, ఈషారెబ్బ లాంటి వాళ్ళు డిజిటల్ ఎంట్రీ ఇచ్చి వెబ్ సిరీస్‌లు చేస్తున్నారు. అక్కడ కూడా ఆమెని ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళు లేకపోవడం ఆశ్చర్యకరం.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago