Categories: Health News

రెండు బెండ కాయ‌ల‌ను నిలువుగా క‌ట్ చేసి గ్లాస్ నీటిలో రాత్రంతా ఉంచి ఉద‌యాన్నే తాగితే ఏమ‌వుతుందో తెలుసా..?

మ‌నం నిత్యం తినే కూర‌గాయ‌ల్లో బెండ‌కాయ కూడా ఒక‌టి. ఇది సీజ‌న్‌తో సంబంధం లేకుండా మ‌న‌కు దొరుకుతుంది. దీంతో ఫ్రై, పులుసు ఎక్కువ‌గా చేసుకుంటారు. ఎలా వండుకున్నా బెండ కాయ రుచి భ‌లేగా ఉంటుంది. అయితే కేవ‌లం రుచికే కాదు, బెండ‌కాయ‌తో మ‌న‌కు ప‌లు ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు కూడా క‌లుగుతాయి. ప‌లు అనారోగ్య స‌మస్య‌ల‌ను కూడా దూరం చేసుకోవ‌చ్చు. అందుకు బెండ‌కాయ‌ను ఎలా తీసుకోవాలో, దాంతో ఏమేం అనారోగ్యాలు న‌యం అవుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

రెండు బెండ‌కాయ‌లను తీసుకుని బాగా క‌డ‌గండి. వాటిని మొద‌లు, చివ‌ర భాగాల‌ను క‌ట్ చేయండి. అనంతరం ఒక్కో బెండ కాయను నిలువుగా చీరండి. కానీ పూర్తిగా చీర‌కూడ‌దు. చివ‌రి భాగం వ‌ర‌కు మాత్ర‌మే గాటు పెట్టాలి. అలా రెండు బెండ‌కాయ‌ల‌ను చీరాలి. అనంతరం ఒక గ్లాస్ నీటిని తీసుకుని అందులో ఆ రెండు బెండ‌కాయ‌ల‌ను వేయండి. ఆపై మూత పెట్టండి. రాత్రంతా ఆ నీటిని అలాగే ఉంచాక‌, ఉద‌యాన్నే ఆ గ్లాస్‌లోంచి బెండ‌కాయ‌ల‌ను తీసేసి ఆ నీటిని ప‌ర‌గ‌డుపునే తాగేయండి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఏయే లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

1. పైన చెప్పిన విధంగా బెండ‌కాయ నీటిని తాగితే పేగులు, జీర్ణాశ‌యం శుభ్ర‌మ‌వుతాయి. అల్స‌ర్లు ఉంటే త‌గ్గుతాయి. గ్యాస్‌, అసిడిటీ, మ‌ల‌బ‌ద్ద‌కం న‌య‌మ‌వుతాయి.

2. ఫైబ‌ర్‌, విట‌మిన్ ఇ, సి, కె, మెగ్నిష‌యం, పాస్ఫ‌ర‌స్ వంటి పోష‌కాలు స‌మృద్ధిగా ల‌భిస్తాయి. దీంతో చ‌క్క‌ని పోష‌ణ అందుతుంది.

3. ర‌క్తం స‌ర‌ఫరా మెరుగు ప‌డుతుంది. గుండె ఆరోగ్యం బాగుంటుంది. బీపీ త‌గ్గుతుంది.

4. మ‌ధుమేహం న‌య‌మ‌వుతుంది. ర‌క్తంలోని షుగ‌ర్ స్థాయిలు కంట్రోల్ అవుతాయి.

5. ఎముక‌లు దృఢంగా మారుతాయి. స్త్రీల‌కు రుతు స‌మ‌యంలో వ‌చ్చే స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి.

6. వేడి శ‌రీరం ఉన్న వారు తాగితే శ‌రీరం చ‌ల్ల‌బ‌డుతుంది.

7. ఒంట్లో అధికంగా ఉన్న కొవ్వు క‌రిగిపోయి అధిక బ‌రువు ఇట్టే త‌గ్గుతారు.

8. చ‌ర్మం కాంతివంతంగా మారుతుంది. జుట్టు దృఢంగా, ఒత్తుగా పెరుగుతుంది.

9. శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. నేత్ర స‌మ‌స్య‌లు పోయి దృష్టి బాగా పెరుగుతుంది.

telugudesk

Recent Posts

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఉచిత బ్యాంక్ కోచింగ్ ప్రారంభం

తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఊరటనిచ్చే నిర్ణయం వెలువడింది. తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బ్యాంకింగ్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు…

2 days ago

ప్రభాస్, రవితేజతో హిట్స్.. కానీ కెరీర్‌ను వదిలేసిన హీరోయిన్

టాలీవుడ్‌లో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన రిచా గంగోపాధ్యాయ్ సినీ ప్రయాణం ఇప్పటికీ ఆసక్తికర చర్చగా నిలుస్తోంది.…

2 days ago

నాగార్జున నమ్మకం లేకపోతే ఆర్జీవీ కెరీర్ ముగిసేది: జేడీ

టాలీవుడ్‌లో క్లాసిక్‌గా నిలిచిన ‘శివ’ సినిమా గురించి మరో ఆసక్తికర విషయాన్ని నటుడు జేడీ చక్రవర్తి వెల్లడించారు. ప్రస్తుతం తన…

2 days ago

బాల్య వివాహం ఆపాలని వెళ్లి.. తప్పు బాలికను తీసుకెళ్లిన అధికారులు

తెలంగాణలోని గద్వాల జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘటన అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలకు దారి తీసింది. బాల్య వివాహాన్ని అడ్డుకోవడానికి…

2 days ago

‘టాక్సిక్’లో కొత్త కోణం.. దర్శకురాలిపై యశ్ ప్రశంసలు

కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమా విడుదలకు ముందు నుంచే సినీ వర్గాల్లో భారీ చర్చకు దారి…

2 days ago

కేసీఆర్‌కు సవాల్.. కవిత కొత్త పార్టీ ప్రకటన

తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసే పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్‌కు దూరమైన కల్వకుంట్ల కవిత, తన రాజకీయ ప్రయాణాన్ని…

2 days ago