Featured

వద్దన్నా వినకుండా రిస్కీ షాట్ చేసి.. చెయ్యి కాల్చుకున్న చిరంజీవి ఎలా ఇబ్బంది పడ్డారో తెలుసా?

ఒకప్పుడు తెలుగు సినిమాల్లో రిస్కీ షాట్లు హీరోలు చేసేవారు కాదు.. డూప్ లు మాత్రమే ఆ పని చేసేది. ఎలాంటి ఇబ్బందికర సీన్లలోనూ నటించేవారు కాదు. ఏమాత్రం కష్టం కలుగుతుంది అని భావించిన డూప్ అరేంజ్ చేసేవాళ్లు దర్శకులు. కానీ తొలిసారి డూప్‌ లేకుండా యాక్ష‌న్ సీన్లు చేశారు మెగాస్టార్ చిరంజీవి. తన సినిమాల్లో మాగ్జిమం డూప్ లు లేకుండా తనే రిస్కీ షాట్లు చేసేవారు. తెలుగులో యాక్ష‌న్ స్టార్‌గా మారిపోయారు. కిరాయి రౌడీలు, కిరాత‌కుడు సినిమాల సమయం నుంచి ఆయన పలు యాక్షన్ సినిమాలు చేసి మంచి క్రేజ్ సంపాదించారు. అయితే ఆయన చేసే రిస్కీ షాట్లను చూసి దర్శకులు సైతం భయపడ్డ సందర్భాలున్నాయట.

హిందీ సినిమా ‘ద జెంటిల్‌మ‌న్’ సెట్స్‌ పై ఓ అనూహ్య ఘటన జరిగిందట. అర్జున్ హీరోగా శంక‌ర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జెంటిల్ మెన్’ సినిమాకు ఈ చిత్రం రీమేక్. దీనిని హిందీలో బాటీవుడ్ టాప్ డైరెక్టర్ మహేష్ భట్ తెరకెక్కించారు. ఈ సినిమాలో చిరంజీవి భుజం కింద ఛాతిలోకి బుల్లెట్ దూసుకెళ్లే సీన్ ఉంటుంది. ఒక రాడ్డుకు స్పిరిట్ ముంచిన దూదిని చుట్టి.. దానితో బుల్లెట్ తగిలిన చోట వెనుక వైపు నుంచి ఆ రాడ్డుతో పొడుస్తాడు చిరంజీవి. అప్పుడు బుల్లెట్ బయటకు వస్తుంది. ఆ గాయాన్ని మాన్పేందుకు గన్ పౌడర్ గాయం మీద వేసి అంటించుకుంటే క్రాకర్ పువ్వొత్తిలా వెలుగుతుంది. దీంతో గాయం మానిపోతుంది.

ఈ రిస్కీ సీన్ తానే చేస్తానని చెప్పాడు చిరంజీవి. అందుకు మహేష్ భట్ వద్దని చెప్పారట. డూప్ తో చేయిద్దామన్నారట. కానీ చిరంజీవి ఒప్పుకోలేదు. అయితే తను ఈ సీన్ చూడలేనని అక్కడి నుంచి వెళ్లిపోయారట భట్. చిరంజీవి తన తోడల్లుడు డాక్ట‌ర్‌ కె. వెంక‌టేశ్వ‌ర‌రావును పిలిపించుకున్నారట. ఒక స్పెష‌ల్ ఎఫెక్ట్స్ ఎక్స్‌ ప‌ర్ట్‌ ను ద‌గ్గ‌ర పెట్టుకున్నారు. త‌న భుజం మీద ర‌క్తంలా క‌నిపించే ఎర్ర‌రంగు పూయించారు. దానిపై గ‌న్‌పౌడ‌ర్ రాశారు. సెట్లో ఉన్న‌వాళ్లంతా టెన్షన్ పడుతున్నారు. కెమెరా రోల్ అవుతోంది.. గ‌న్‌పౌడ‌ర్ మీద మంట వెలిగించారు. గ‌న్‌పౌడ‌ర్ బ‌ర్న్‌ అయ్యి మంట మండింది. బాధ‌ను భ‌రిస్తున్న‌ట్లు చిరంజీవి యాక్ట్ చేస్తున్నారు. కాసేపటికి దర్శకుడు లేడని తెలిసి ఆమంటను ఆర్పుకున్నాడు. సెట్ లో ఉన్నవాళ్లంతా చప్పట్ల మోత మోగించారు. కానీ తర్వాత చూస్తే చిరంజీవి చేయి కాలింది. వెంటనే వెంకటేశ్వర్ రావు చికిత్స చేశాడు. ఇలాంటి సీన్లు చిరంజీవి చాలా సినిమాల్లో చేయడం విశేషం.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

కరెంట్ లేకుండా ఇల్లు కూలర్‌లా చల్లగా! ఈ పాత ట్రిక్ ట్రై చేయండి!

వేసవి వేడిని తట్టుకోవడం చాలా మందికి పెద్ద సవాలుగా మారుతోంది. ముఖ్యంగా విద్యుత్ ఖర్చులు పెరుగుతున్న ఈ రోజుల్లో, ఏసీ…

4 hours ago

40 దాటినా ఫిట్‌గా రొనాల్డో… ఈ ఒక్క అలవాటు మీకూ మార్పు తీసుకురాగలదు!

ఫుట్‌బాల్ ప్రపంచంలో వయసు కేవలం సంఖ్య మాత్రమేనని నిరూపించిన పేరు క్రిస్టియానో ​​రొనాల్డో. నలభై దాటిన తర్వాత కూడా యువ…

4 hours ago

బుద్ధ పౌర్ణిమ 2026: ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలిచిన పవిత్ర దినం.. ప్రాముఖ్యత, ఆచరణ విధానం!

భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో బుద్ధ పౌర్ణిమకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ రోజు బౌద్ధమత స్థాపకుడు గౌతమ బుద్ధుడు జననం,…

4 hours ago

కళ్ల సమస్యలు పోతాయట! ఈ వారాహి దేవి ఆలయం ఎక్కడుందో తెలుసా?

భారతదేశంలో అనేక దేవాలయాలు తమ ప్రత్యేక విశేషాలతో భక్తులను ఆకర్షిస్తుంటాయి. వాటిలో కొన్ని ఆలయాలు ఆధ్యాత్మిక శక్తి, విశ్వాసాలు, అద్భుతమైన…

4 hours ago

ట్రెండ్ కోసం ఈ పేర్లు పెడుతున్నారా? మీ పిల్లల భవిష్యత్తు ప్రమాదంలో పడొచ్చు!

పిల్లలకు పేరు పెట్టడం అనేది ప్రతి తల్లిదండ్రికి ప్రత్యేకమైన అనుభూతి. చాలా మంది ఈ విషయంలో కొత్తదనం, ట్రెండ్, వినూత్నతకు…

4 hours ago

డబ్బు కలలు వస్తున్నాయా? మీ జీవితంలో పెద్ద మార్పు రాబోతోంది!

నిద్రలో కనిపించే కలలకు మనసుతో పాటు భవిష్యత్తుతో కూడా సంబంధం ఉంటుందని భారతీయ సంప్రదాయాల్లో విశ్వాసం ఉంది. ముఖ్యంగా డబ్బుతో…

4 hours ago