నదియా.. ప్రస్తుతం తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ బాగా పేరు సంపాదిస్తోంది. తన చక్కటి రూపంతో పాటు అద్భుత అభినయంతో ఆకట్టుకుంటుంది. పవన్ కల్యాణ్ నటించిన అత్తారింటికి దారేది సినిమాలో మంచి నటన కనబర్చి ఆకట్టుకుంది ఈ నటీమణి. నిజానికి నదియా ఎప్పుడో తెలుగు తెరకు పరిచయం అయ్యింది. 1988లోనే కోదండరామిరెడ్డి దర్శకత్వంలో రమేశ్ బాబు హీరోగా వచ్చిన బజారు రౌడీ సినిమాలో ఆమె హీరోయిన్ గా నటించింది. అప్పటికే తను తమిళంలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంది. తమిళ టాప్ స్టార్స్ రజనీకాంత్, విజయ్‌కాంత్, సత్యరాజ్, ప్రభు సహా పలువురు హీరోలతో కలిసి నటించింది. మంచి పాపులారిటీని సాధించింది.
ఇక తన వ్యక్తిగత జీవితానికి వస్తే.. అందాల తారగ గుర్తింపు పొందిన నదియా.. 1988లోనే శిరీష్ గాడ్ బోలే అనే బిజినెస్ మ్యాన్ ను పెళ్లి చేసుకుంది. తన వివాహం నాటికి కెరీర్ మంచి సక్సెస్ మీదుంది. తెలుగులో బజారు రౌడీ, వింత దొంగలు సినిమా చేసే సమయంలోనే తను మ్యారేజ్ చేసుకుంది. ఆ తర్వాత భర్తతో కలిసి లండన్ వెళ్లిపోయింది. ఈ దంపతులకు ఇద్దరు కూతుళ్లు. 1996లో సనమ్, 2001లో జానా జన్మించారు. ఆ తర్వాత ముంబైకి వచ్చి సెటిల్ అయ్యారు..
2004లో నదియా మళ్లీ సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. జయం రవి తల్లిగా ఎం. కుమరన్ సన్నాఫ్ మహాలక్ష్మి తమిళ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో ప్రభాస్ తల్లిగా మిర్చితో రిఎంట్రీ ఇచ్చింది. తన వన్నెతరగని అందంతో పాటు అభినయంతో జనాలను ఆకట్టుకుంది. అత్తారింటికి దారేది చిత్రంలో పవన్ కల్యాణ్ మేనత్తగా నటించి అదుర్స్ అనిపించింది. తెలుగు, అటు తమిళ సినిమాలతో బిజీగా మారడంతో నదియా ప్రస్తుతం చెన్నైకి మారింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నదియా.. తన ఫ్యామిలీ ఫోటోలతో పాటు తన సినిమాలకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు వెల్లడిస్తూ వస్తుంది. కొంత కాలం క్రితం తన ఇద్దరు కూతుళ్లతో దిగిన ఫోటోలను షేర్ చేసింది. పిల్లల కంట తల్లే యంగ్ గా ఉందంటూ నెటిజన్లు కామెంట్ల వర్షంకురిపించారు. అంతేకాదు.. అమ్మలా కాదు.. అక్కలా ఉందని మరికొందరి అభిప్రాయపడ్డారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…