Featured

హీరోయిన్ శ్రీదేవిని రామానాయుడు ఎందుకు ఎత్తుకెళ్ళారో తెలుసా ?

రాముడు భీముడు తో ప్రారంభమైన సురేష్ ప్రొడక్షన్స్ ఆ తర్వాత అద్భుతమైన చిత్రాలను తీయడం జరిగింది. 1971లో కె. ప్రకాశరావు దర్శకత్వంలో వచ్చిన ప్రేమనగర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించింది. ఆ తర్వాత 1980 వచ్చేసరికి డి.రామానాయుడు తన సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లో ఒక చల్లని రాత్రి, కక్ష, అగ్నిపూలు, ప్రేమ మందిరం లాంటి చిత్రాలను తీసి పీకల్లోతు నష్టాల్లో కూరుకు పోయారు. ప్రేమమందిరం సినిమా ప్రేమనగర్ సినిమాల అద్భుత విజయాన్ని సాధిస్తుందని భారీ అంచనాల నడుమ సినిమా విడుదలైంది. కానీ బాక్సాఫీస్ వద్ద తీవ్రమైన నిరాశను చవిచూసింది. ఆ తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ గారి నాన్న గారైన సత్యమూర్తి ఆ రోజుల్లో ఆంధ్రప్రభ పత్రికలకు కథలు రాసేవాడు.

అందులో వచ్చిన ఒక కథను యువఆర్ట్స్ అధినేత మురారికి నచ్చడంతో సత్యమూర్తిని మద్రాస్ పిలిపించారు. అలా సత్యమూర్తి ని రాఘవేంద్ర రావు దగ్గరికి తీసుకెళ్లి ఒక కథ సత్యమూర్తిచే నిర్మాత మురారి చెప్పించారు. ఎందుకనో ఆ సినిమా రూపు దాల్చలేదు. ఆ తర్వాత కొన్ని రోజులకు డి.రామానాయుడు రాఘవేంద్రరావు కాంబినేషన్ లో ఒక సినిమా అనుకోగా కథ కోసం సత్య మూర్తిని రాఘవేంద్రరావు పిలిపించారు. ఆ కథ డి.రామానాయుడుకు నచ్చడంతో దేవత సినిమా ప్రారంభిద్దాం అనుకున్నారు. కానీ అంతకుముందే అడవి రాముడు, వేటగాడు, కొండవీటి సింహం లాంటి చిత్రాలు తీసిన రాఘవేంద్రరావుకు ఇలాంటి ఫ్యామిలీ చిత్రాన్ని తీయగలరా అని డి.రామానాయుడు అనుకున్నారు. కానీ చివరకు రాఘవేంద్రరావు కే అవకాశం ఇవ్వడం జరిగింది. ఈ చిత్రానికి సత్యానంద్ ను మాటల రచయితగా ఎంపిక చేసుకున్నారు.

సురేష్ ప్రొడక్షన్స్ లో హీరో శోభన్ బాబు కు దేవత ఏడవ సినిమా, శ్రీదేవికి ఈ చిత్రం మూడవ సినిమా, జయప్రదకు రెండవ సినిమా, రాఘవేంద్రరావుకు ఈ చిత్రమే మొదటి సినిమా. ఈ సినిమాలో పాటలు అత్యద్భుతంగా ఉంటాయి. ముఖ్యంగా వేటూరి రాసిన “వెళ్లువచ్చి గోదారమ్మ వెల్లాకిలా పడ్డాదమ్మో…” అనే పాట దేవత చిత్రం విడుదల అయిన తర్వాత ఆంధ్రదేశమంతటా ఒక ఊపు ఊపేసింది.

ఈ పాట చిత్రీకరణ రాజమండ్రి దగ్గర అగ్రహారంలో గోదావరి తీర ప్రాంతంలో షూటింగ్ జరిపారు. దేవత చిత్రయూనిట్ గోదావరి నదిపై బోటులో ప్రయాణించి ఆ తర్వాత కొంత దూరం బురదలో నడిస్తే లోకేషన్స్ స్పాట్ వచ్చేది. అలా బురదలో నడిస్తే శ్రీదేవి వేసుకున్న కాస్ట్యూమ్స్ పై బురద పడుతుందని నిర్మాత డి.రామానాయుడు శ్రీదేవిని లొకేషన్ స్పాట్ వరకి ఎత్తుకెళ్లేవారు. ఈ పాట కోసం బిందెలను రాజమండ్రి నుంచి తెప్పించారు. అలా ఈ సినిమా 1982లో విడుదలై అత్యద్భుతమైన విజయాన్ని సాధించింది.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago