Movie News

‘KGF2’ రన్ టైం ఎన్ని గంటలో తెలుసా..??

కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యశ్ హీరోగా నటించిన సినిమా ‘KGF’.. పాన్ ఇండియా మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అన్ని భాషల్లో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది..ఈ ఒకే ఒక్క సినిమా కన్నడ హీరో యశ్ ని ఓవర్ నైట్ స్టార్ ని చేసింది.. అంతేకాదు ఈ సినిమా హిట్ తో దర్శకుడు ప్రశాంత్ నీల్ కు తెలుగులో ఆఫర్లు క్యూ కట్టాయి. ఇక త్వరలో కేజీఎఫ్ పార్ట్ 2 రాబోతుంది.

దక్షిణాది సినీ పరిశ్రమను మరో మెట్టు ఎక్కించిన కేజీఎఫ్‌కు సీక్వెల్‌గా వస్తోందీ సినిమా. ఈ సినిమాలో రాకీ భాయ్‌ను ఢీ కొట్టేందుకు అధీరాగా వస్తున్నాడు బాలీవుడ్‌ హీరో సంజయ్‌దత్‌. మరో బాలీవుడ్ నటి రవీనాటాండన్ కీలక పాత్రలో నటిస్తుంది. కేజీఎఫ్ ఛాప్టర్ 1 భారీ విజయం సాధించడంతో ఛాప్టర్ 2పై అంచనాలు భారీగా ఉన్నాయి. ప్రకాశ్ రాజ్, రావు రమేష్ ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు.అయితే ఇదివరకే గ్లింప్స్ తో పాటుగా కేజీఎఫ్-2 రిలీజ్ డేట్ ప్రకటించారు మేకర్స్.

ఇప్పుడు ఈ సినిమా అనుకున్న టైం కి వస్తుందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగవంతంగా జరుపుతున్నారు చిత్రయూనిట్. తాజాగా ఈ సినిమా డ్యూరేషన్ గురించి ఇంటరెస్టింగ్ చర్చ జరుగుతుంది. ఈ సినిమా డ్యూరేషన్ 2గంటల 52నిముషాలు ఉన్నట్లు తెలుస్తుంది..దీంతో ఇప్పుడు ఈ సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి..

ఇక ప్రశాంత్ నీల్ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాడు.. ఈ సినిమా తోపాటు మరో వైపు పాన్ ఇండియా హీరో ప్రభాస్ తో సలార్ సినిమాను కూడా చేస్తున్నాడు ప్రశాంత్ నీల్… ఆసినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది..ఇప్పటికే బొగ్గు గనుల్లో ఓ షెడ్యూల్ షూటింగ్ ని కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది..ఏప్రిల్ 14, 2022లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది…!!

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

మార్చి 3 చంద్రగ్రహణ ప్రభావం.. జాగ్రత్తగా లేకపోతే ఇబ్బందులే!

2026లో తొలి చంద్రగ్రహణం త్వరలోనే సంభవించనుంది. ఈసారి హోలీ పండుగ రోజునే గ్రహణం పడనున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జ్యోతిష్య…

10 minutes ago

మేడి పండులో నిజంగానే పురుగులుంటాయా? అసలు నిజం ఇదే!

“మేడి పండు చూడు మేలిమైనుండు… పొట్ట విప్పి చూడు పురుగులండు” అనే పద్యం మనందరికీ చిన్నప్పటి నుంచే పరిచయం. బయటకు…

33 minutes ago

వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ? క్లారిటీ ఇచ్చిన కవిత:

తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు రంగం సిద్ధమవుతోంది. కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా…

53 minutes ago

తెలంగాణ విమానయాన రంగంలో మరో అడుగు.. ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు కేంద్ర గ్రీన్ సిగ్నల్:

తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…

3 hours ago

నెలసరి నొప్పులతో బాధపడుతున్నారా? ఈ నేచురల్ జ్యూస్ ట్రై చేయండి!

నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…

3 hours ago

కష్టమే విజయానికి దారి – మృణాల్ ఠాకూర్ ప్రేరణాత్మక వ్యాఖ్యలు…

సినీ పరిశ్రమలో కనిపించే మెరుపులు, గ్లామర్‌ వెనుక ఎన్నో సంవత్సరాల కష్టం దాగి ఉంటుందని ప్రముఖ నటి Mrunal Thakur…

3 hours ago