General News

రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాలో ఆ పాటకు మాత్రమే 3 కోట్ల బడ్జెట్..?

దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నటువంటి తాజా చిత్రం “ఆర్ఆర్ఆర్”. ఈ చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించగా, జూనియర్ ఎన్టీఆర్ కొమురంభీమ్ పాత్రలో సందడి చేయనున్నారు. అదే విధంగా ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అలియాభట్, ఒలీవియా మోరీస్‌ వీరికి జంటగా సందడి చేయనున్నారు.

ఇప్పటికే పలుమార్లు ఈ సినిమా విడుదల వాయిదా పడుతూ వస్తోంది. కరోనా ప్రభావం వల్ల షూటింగ్ వాయిదా పడటంతో ఈ సినిమా విడుదల వాయిదా పడుతోంది. అయితే ప్రస్తుతం కరోనా పరిస్థితులు చెక్క పడటంతో తిరిగి ఈ చిత్రం షూటింగ్ ప్రారంభించింది. ఈ క్రమంలోనే ఈ సినిమాకి సంబంధించిన సమాచారం ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో సీత పాత్రలో నటిస్తున్నటువంటి ఆలియా భట్ మీద ఈభారీ బడ్జెట్ పాటను చిత్రీకరించనున్నారట. ఈ పాటలో కేవలం అలియా కాస్ట్యూమ్స్ కోసమే ఏకంగా కోటి రూపాయలు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాత డి.వి.వి.దానయ్య నిర్మించగా ఈ సినిమాకు ఎంఎం కీరవాణి సంగీతాన్ని సమకూరుస్తున్నారు.

ఈ సినిమాలో కేవలం ఒక పాట కోసమే మూడు కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించడంతో ఈ పాట ఏ స్థాయిలో ఉంటుందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రీయ, సముద్రఖని, బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ పలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ముందుగా అనుకున్న ప్రకారమే ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 13వ తేదీన విడుదల చేయడానికి దర్శకుడు శతవిధాల ప్రయత్నిస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సినిమా కోసం కఠిన నియమాలు.. కృతి సనన్ ఫిట్‌నెస్ సీక్రెట్ బయటపెట్టింది

సినిమాల్లో కనిపించే గ్లామర్ వెనుక ఎంత కష్టముంటుందో మరోసారి నిరూపించారు బాలీవుడ్ స్టార్ కృతి సనన్. తాజాగా ఆమె నటిస్తున్న…

6 hours ago

పవన్ కల్యాణ్ కోసం కొండగట్టులో పూజలు.. అభిమానుల ఆరాటం వైరల్

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోగ్యం కోసం అభిమానులు, పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.…

6 hours ago

ట్రంప్‌తో టీ తాగించిన తరుణ్ భాస్కర్.. వీడియో వైరల్!

టాలీవుడ్‌లో తన ప్రత్యేక శైలితో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు-నటుడు తరుణ్ భాస్కర్ మరోసారి వినూత్న ప్రమోషన్‌తో వార్తల్లో నిలిచారు. కొత్త…

6 hours ago

బాణాసంచా తయారీ కేంద్రంలో విషాదం.. కేంద్రం అలర్ట్

కేరళ రాష్ట్రంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. త్రిస్సూర్ జిల్లాలో బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ప్రాణనష్టం కలిగించింది.…

6 hours ago

సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వదిలి షాకింగ్ పని.. టెర్రస్‌పై గంజాయి!

హైదరాబాద్ నగరంలో మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. సాఫ్ట్‌వేర్ రంగంలో పనిచేసిన ఒక వ్యక్తి, గంజాయి అలవాటుతో విచిత్ర…

6 hours ago

ఆయన నమ్మకమే నా కెరీర్ మలుపు.. అజయ్ ఘోష్ ఎమోషనల్..!

తెలుగు సినీ పరిశ్రమలో తన ప్రత్యేక నటనతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు అజయ్ ఘోష్, ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా…

7 hours ago