దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నటువంటి తాజా చిత్రం “ఆర్ఆర్ఆర్”. ఈ చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించగా, జూనియర్ ఎన్టీఆర్ కొమురంభీమ్ పాత్రలో సందడి చేయనున్నారు. అదే విధంగా ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అలియాభట్, ఒలీవియా మోరీస్ వీరికి జంటగా సందడి చేయనున్నారు.

ఇప్పటికే పలుమార్లు ఈ సినిమా విడుదల వాయిదా పడుతూ వస్తోంది. కరోనా ప్రభావం వల్ల షూటింగ్ వాయిదా పడటంతో ఈ సినిమా విడుదల వాయిదా పడుతోంది. అయితే ప్రస్తుతం కరోనా పరిస్థితులు చెక్క పడటంతో తిరిగి ఈ చిత్రం షూటింగ్ ప్రారంభించింది. ఈ క్రమంలోనే ఈ సినిమాకి సంబంధించిన సమాచారం ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో సీత పాత్రలో నటిస్తున్నటువంటి ఆలియా భట్ మీద ఈభారీ బడ్జెట్ పాటను చిత్రీకరించనున్నారట. ఈ పాటలో కేవలం అలియా కాస్ట్యూమ్స్ కోసమే ఏకంగా కోటి రూపాయలు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాత డి.వి.వి.దానయ్య నిర్మించగా ఈ సినిమాకు ఎంఎం కీరవాణి సంగీతాన్ని సమకూరుస్తున్నారు.
ఈ సినిమాలో కేవలం ఒక పాట కోసమే మూడు కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించడంతో ఈ పాట ఏ స్థాయిలో ఉంటుందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రీయ, సముద్రఖని, బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ పలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ముందుగా అనుకున్న ప్రకారమే ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 13వ తేదీన విడుదల చేయడానికి దర్శకుడు శతవిధాల ప్రయత్నిస్తున్నారు.

































