Fake Fertilizers: వేల రూపాయలు పోసి ఎరువుల బస్తాలు కొన్న రైతు… వాటి తెరిచి చూసి లబోదిబోమన్నాడు!
Fake Fertilizers: భారత దేశంలో వ్యవసాయం అంటేనే రుతుపవనాలతో జూదం. ఏ ఏడాది పంట చేతికి వస్తే మరో ఏడాది తీవ్ర వర్షాల వల్లనో, కరువు వల్లనో తీవ్ర నష్టం వాటిల్లుతోంది. అయినా ఏ నాడు వ్యవసాయాన్ని వదలడం లేదు రైతన్నలు. ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి వ్యవసాయం చేస్తున్నారు. ఏటా ఎరువులకు, కౌలుకు, కూలీలకు రేట్లు పెరుగుతున్నాయి.
మొత్తంగా పెట్టుబడీ పెరుగుతున్నా.. అందుకు తగిన గిట్టుబాటు ధర కూడా రావడం లేదు. కనీసం మద్దతు ధర కూడా రాని పరిస్థితి ఉంది. ఇదిలా ఉంటే మరోవైపు కల్తీ విత్తనాలు, ఎరువులతో రైతులను దోచుకుంటున్నారు. వ్యాపారుల మాటలు నమ్మి నట్టేటా మునిగిపోతున్నారు.
ముఖ్యంగా సీజన్ ప్రారంభం అయిందంటే నకిలీ విత్తనాలు.. ముఖ్యంగా పత్తి, మిర్చి విత్తానాలు నకిలీవి అమ్ముతున్నారు. పంట వేసిన కొంత కాలానికి కాపు, పూత రాక నష్టపోతున్నారు. పురుగుల మందు తాగుతూ.. ఉరి వేసుకుంటు రైతులు తనువు చాలిస్తున్నారు.
సరిగ్గా ఇలాంటి కల్తీ వ్యవహారమే రాజంపేట మండలంలో చోటు చేసుకుంది. మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లో తిరుగుతూ రైతులకు నకిలీ ఎరువులు అంటగట్టారు. తడమడ్ల గ్రామంలో రైతు స్వామికి ఇలాంటి నకిలీ ఎరువులను అంటగట్టారు. బస్తాకు రూ. 1000 నుంచి రూ. 2000 లకు ఎరువులను అంటగట్టి… ఎక్కువ దిగుబడి వస్తుందంటూ.. మాయమాటలు చెప్పారు. దోమకొండ మండలం కేంద్రంతో పాటు జిల్లా కేంద్రంలోని గోదాంలతో స్టాక్ పెట్టి పలు గ్రామాల్లో విక్రయించారు. అయితే పంటలో వేస్తే ఎటువంటి మార్పు రాలేదని.. కేవలం మట్టి మాత్రమే బస్తాల్లో ఉందని రైతులు ఆరోపిస్తున్నారు. తాము మోసపోయామని.. ఇప్పటికైనా అధికారులు కల్తీ వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…