అన్ని బంధాలకంటే.. పేగు బంధం గొప్పది అంటారు పెద్దలు. వివాహేతర సంబంధాల వల్ల ఇలాంటి బంధాలు కూడా మట్టిలో కలిసిపోతున్నాయి. పెళ్లి అనే బంధానికి కూడా మాయని మచ్చ తెస్తున్నారు. పరాయి మహిళ లేదా పురుషుడి మోజులో పడి కుటుంబాలను నాశనం చేసుకుంటున్నారు. ఇలాంటిదే ఓ ఇల్లాలు వివాహేతర సంబంధం పెట్టుకొని తన పిల్లలపైనే ప్రతాపం చూపిస్తోంది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడు విల్లిపురం జిల్లాకు చెందిన సత్యమంగళం గ్రామానికి చెందిన వడివేలన్, తులసి దంపతులు. వీరికి రెండు సంవత్సరాలు, నాలుగు సంవత్సరాల ఇద్దరు మగ బిడ్డలు ఉన్నారు. అయితే గత కొంత కాలంగా ఈ దంపతుల మధ్య గొడవలు మొదలయ్యాయి.
భర్త మీద కోపం ఆమె పిల్లలపై చూపించేది. ఎప్పుడు గొడవ జరిగినా వాళ్లను కొట్టడమే కాకుండా.. వీడియోలు తీసి తన భర్తకు పంపించడం అలవాటు చేసుకుంది. ఇలా ఓరోజు తన కొడుకులను 250 సార్లు కొట్టినట్టుగా తన భర్తకు వీడియో పంపింది. దీంతో అతడు తన భార్య వేధింపులకు విసిగి పోయాడు. లాభం లేదని వెళ్లి పోలీసులకు ఈ వీడియో చూపించాడు.
ఆమెకు ఓ ప్రియుడు ఉన్నాడని.. అందుకే రోజు తమ మధ్య గొడవలు మొదలయ్యేయని.. దానికి ప్రతీ కారంగా పిల్లలను చిత్రహింసలకు గురిచేస్తుందని చెప్పాడు. దీనిపై పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసుకోగా.. ఆమె పరారీలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆమె తమిళనాడు బోర్డర్ దాటి చిత్తూరుకు వెళ్లినట్లు సమాచారం.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…