దాదాపు నెల రోజుల క్రితం వాళ్లిద్దరు పెళ్లి చేసుకున్నారు. కానీ ఆమెకు అంతక ముందే మరో వ్యక్తితో సంబంధం ఉంది. ఈ క్రమంలో ఆమె భర్తను దారుణంగా కాల్చి చంపారు. ఆమె మాజీ ప్రియుడే ఈ హత్య చేశాడని పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్ లోని ఉన్నావోలోని ఓ పాఠశాలలో ప్రీతి, హేమేంద్రలు పని చేస్తున్నారు.
ఈ పాఠశాలలోనే పని చేసే సునీల్ అనే ఉపాధ్యాయుడు.. హేమేంద్రకు స్నేహితుడు. అయితే ప్రతీ, హేమేంద్రల పరిచయం ప్రేమగా మారింది. మూడు సంవత్సరాల తర్వాత అంటే.. ఈ ఏడాది జనవరిలో.. ఎటవాహ్‌లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు అతడు బదిలీ అయ్యాడు.
మరో వైపు ప్రతీ సింగ్ జూలైలో లక్నోలోని డయాగ్నొస్టిక్ సెంటర్‌లో పీఆర్‌వోగా పనిచేస్తున్న హర్దోయికి చెందిన అశుతోష్ సింగ్‌ను పెళ్లి చేసుకుంది. అతడికి ఇద్దరు సోదరులు ఉన్నారు. వాళ్లతో కలిసి లక్నోలోని మహర్షి నగర్ లో నివాసం ఉంటున్నాడు. అయితే ఆగస్టు 24న అశుతోష్ ను సర్వీస్ రోడ్డుపై ఎవరో కాల్చి చంపేశారు.
చనిపోక ముందు అతడికి బిజినెస్ గురించి మాట్లాడాలని.. హేమేంద్ర అతడి స్నేహితుడు సునీల్ అతడికి ఫోన్ చేసి కలిశారు. ఆ తర్వాత అతడిని కాల్చి చంపేశారు. ఘటనా స్థలానికి చేరిన పోలీసులు ఫోన్ నంబర్ ఆధారంగా నిందితుడిని పట్టుకోగా.. ప్రతీని ప్రేమిస్తున్నట్లు చెప్పాడు. ప్రీతి అతడితో సంతోషంగా లేదని తన స్నేహితుడు సునీల్ కు చెబుతూ ఉండేదని.. అన్నారు. దీంతో తాము అతడిని అంతం చేయాలనే ఆలోచనతో ఇలా ప్లాన్ చేసి చంపేసినట్లు తెలిపారు. దీంతో ప్రీతిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ముగ్గురుని అరెస్టు చేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…