Sarkari vaari Paata: సర్కారీ వారి పాటలో మురారి బావ అంటూ కొత్త సాంగ్..?
Sarkari vaari Paata: సూపర్ స్టార్ మహేష్ బాబు కీర్తి సురేష్ జంటగా నటించిన లేటెస్ట్ చిత్రం సర్కారీ వారి పాట. ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ మే 12వ తేదీ విడుదల అయ్యింది. ఈ క్రమంలోనే ఈ సినిమా కలెక్షన్ల పరంగా మంచి కలెక్షన్లను రాబట్టిన మిక్సిడ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమా విడుదలైన నాలుగు రోజుల్లోనే అమెరికాలో ఏకంగా 2 మిలియన్ మార్క్ అందుకుంది.
ఇక రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా ఈ సినిమా మంచి కలెక్షన్లను రాబడుతోంది.ఈ క్రమంలోనే ప్రేక్షకులను ఆకట్టుకోవడం కోసం పెద్ద ఎత్తున సినిమా ప్రమోషనల్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు మహేష్ బాబు సైతం సోషల్ మీడియా వేదికగా ఈ సినిమాకి సంబంధించి వీడియోలు షేర్ చేస్తూ భారీ స్థాయిలో ప్రమోషన్ చేస్తున్నారు.
ఇకపోతే తాజాగా ఈ సినిమా సక్సెస్ పార్టీని కర్నూలులో ఎంతో ఘనంగా నిర్వహించారు.సాధారణంగా ఇలాంటి పార్టీలకు మహేష్ బాబు చాలా దూరంగా ఉంటారు. కానీ ఈ సక్సెస్ పార్టీలో మహేష్ బాబు పాల్గొని ఏకంగా స్టేజిపై డాన్సులు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరిచారు. ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఇకపోతే తాజాగా ఈ సినిమాలో మరొక కొత్త పాటను యాడ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మురారి బావా అంటూ సాగిపోయే ఈ పాట ఇప్పటి వరకు ఎక్కడా కూడా బయటకు రాలేదు. అయితే ఈ పాటను త్వరలోనే సినిమాలో యాడ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ పాటను యూట్యూబ్ లో విడుదల చేస్తారని చాలా మంది భావించారు. అలా కాకుండా ఈ పాటని ఏకంగా థియేటర్లోనే విడుదల చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…