Nataraj Master: బిగ్ బాస్ విన్నర్ నేనే … నటరాజ్ మాస్టర్ షాకింగ్ కామెంట్స్!
Nataraj Master: ప్రస్తుతం ఓటీటీలో బిగ్ బాస్ నాన్ స్టాప్ కార్యక్రమం చివరి దశకు చేరుకుంది. ఈ క్రమంలోనే ఈ వారం నటరాజ్ మాస్టర్ హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యారు. ఇక హౌస్ లో ఏడుగురు కంటెస్టెంట్ ల మధ్య తీవ్ర స్థాయిలో పోటీ ఏర్పడింది. ఇక అందరూ ఊహించిన విధంగానే ఈ వారం హౌస్ నుంచి నటరాజ్ మాస్టర్ ఎలిమినేట్ అయ్యారు.
ఈయన ఎలిమినేట్ కాగానే ఎంతోమంది ఈయనతో ఇంటర్వ్యూలు తీసుకోవడానికి ఎదురుచూస్తూ ఉన్నారు.
ఈ క్రమంలోనే ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న నటరాజ్ మాస్టర్ ఎన్నో ఆసక్తికరమైన విషయాల గురించి వెల్లడించారు.ఈ సందర్భంగా బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ కావడం పై మీ స్పందన ఏంటి అని ప్రశ్నించగా నట్రాజ్ మాస్టర్ షాకింగ్ కామెంట్ చేశారు.
ఈ ప్రశ్నకు ఆయన సమాధానం చెబుతూ బిగ్ బాస్ విన్నర్ తానే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా నటరాజ్ మాస్టర్ మాట్లాడుతూ.. ఇంట్లో ఉన్నప్పుడు ఎంతో నిజాయితీగా ఆడాను. కానీ నాకు ఎవరు ఓట్లు వేయలేదు. బయటకి వచ్చి చూడగా సోషల్ మీడియాలో అందరూ తప్పుడు ఓట్లు వేసుకుని ఇంకా హౌస్ లో కొనసాగుతున్నారు.
ఇలా నిజాయితీగా ఆడిన తను హౌస్ నుంచి బయటకు వచ్చానని, దొంగ ఓట్లతో ఆడేవారు ఇంకా హౌస్ లోనే కొనసాగుతున్నారంటూ నటరాజ్ మాస్టర్ షాకింగ్ కామెంట్ చేశారు. ఇలా దొంగ ఓట్లతో హౌస్ లో కొనసాగే వారు నిజమైన విన్నర్స్ కాదు. నిజాయితీగా ఆడిన తానే బిగ్ బాస్ విన్నర్ అంటూ నటరాజ్ మాస్టర్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…