ఆధార్ కార్డు అనేది భారతదేశ పౌరుడికి తప్పనిసరి. ఇది ప్రారంభించి దాదాపు 10 సంవత్సరాలు దాటినా ఇంకా మారుమూల గ్రామాల్లో నివసించే షెడ్యూల్డ్ తెగల వారు తీసుకోలేదు. ముఖ్యంగా 5 సంవత్సరాల లోపు పిల్లలకు బయోమెట్రిక్ విషయంలో సమస్యలు ఉండటంతో తీసుకోలేక పోయారు. 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు ఆధార్ తయారుచేసేటప్పుడు బయోమెట్రిక్ సేకరించడం లేదని యుఐడిఎఐ ట్వీట్ చేసింది.
బయోమెట్రిక్ అంటే పిల్లల వేలిముద్ర, వారి ఐరిస్ స్కానింగ్ కలిగి ఉంటుంది. అయితే ఈ రెండిటిని 5 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలకు సేకరించడం తప్పనిసరి. పిల్లల తల్లిదండ్రులే ఐదేళ్ల లోపు ఉన్న పిల్లలకు ఫింగర్ స్కాన్ చేస్తారు. 5 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు ఆధార్ కార్డు తీసుకోవాలంటే బాల్ ఆధార్ కోసం ఎలా దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. దానికి ముందుగా UIDAI అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లాలి. అక్కడ మీరు ఆధార్ కార్డు రిజిస్ట్రేషన్ లింక్‌పై క్లిక్ చేయాలి. అక్కడ వ్యక్తిగత వివరాలను నమోదు చేయాలి. దీంతో వారికి స్లాట్ బుకింగ్ కనపడుతుంది.
మనకు దగ్గర్లో ఉండే ఆధార్ సెంటర్ కు ఏ సమయంలో , ఎప్పుడు వెళ్లాలో షెడ్యూల్ చేయబడుతుంది. దాని ప్రకారం వాళ్లు అక్కడకు వెళ్లాలి. 5 సంవత్సరాల లోపు పిల్లలకు ఫోటో మాత్రమే తీసుకుని.. మిగతావి తల్లి లేదా తండ్రివి బయోమెట్రిక్ తీసుకుంటారు. దీనికి పిల్లల జనన ధృవీకరణ పత్రం, తల్లిదండ్రుల ఆధార్ కార్డు ఫోటోకాపీ, రిఫరెన్స్ నంబర్ ను వారు వెరిఫై చేస్తారు. వాటిని తమ వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. 5 సంవత్సరాలు దాటిన తర్వాత ఆధార్ సెంటర్ కి వెళ్లి బయోమెట్రిక్ అంటే చేతి వేళ్లు, ఐరిస్ స్కానింగ్ ఇచ్చి అప్ డేట్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఇక్కడ అన్నీ ప్రక్రియలను పూర్తి అయిన తర్వాత మనకు ఒక సంఖ్యను కేటాయిస్తారు. దీంతో మన ఆధార్ స్థితిని తెలుసుకునే వీలుంటుంది. అరవై రోజుల తరువాత రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌లో ఎస్ఎంఎస్ అందుతుంది. నమోదు ప్రక్రియ జరిగిన దాదపు మూడు నెలల తర్వాత ఆధార్ కార్డును పోస్టులో ఇంటికి పంపిస్తారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…