కరోనాతో ప్రపంచం మొత్తం విలవిలలాడిపోతున్నాయి. మొదటి వేవ్ కంటే సెకండ్ వేవ్ వ్యప్తి బలంగా ఉండటంతో మరణాల సంఖ్య కూడా ఎక్కువగా నమోదయ్యాయి. అయితే కరోనా నుంచి మనకు మనం రక్షించబడాలంటే వ్యాక్సిన్ ఒక్కటే మార్గమని వైద్యులు మొదటి నుంచి చెబుతూ వస్తున్నారు. అయితే వీటిపై కొంతమందికి అపోహలు ఉండటంతో దూరంగా ఉంటున్నారు. అయితే తాజాగా ఇలా వ్యాక్సిన్ తీసుకోని వారికి మరో ప్రమాదం ముంచుకొస్తోంది. అదేంటంటే.. ప్రపంచంలోని కోవిడ్ వైరస్ వేరియంట్లన్నింటిలోకి డెల్టా వేరియంట్ వేగవంతమైన, ప్రభావవంతమైనది.
అయితే ఇది ఎక్కువగా టీకా తీసుకోని వారిలో ఎక్కుగా సోకుతుందని గణంకాలు చెబుతున్నాయి. రెండు డోసులు కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి కూడా ఇన్‌ఫెక్షన్ కలిగించే సత్తా డెల్టాకు ఉందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. పైగా టీకా తీసుకున్నా సరే డెల్టా సోకినవారు ఇతరులకు దీన్ని వ్యాప్తి చేయగలరని నిపుణులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం ప్రపంచానికి అతిపెద్ద ముప్పు డెల్టానే అని సైంటిస్టు షారన్ పీకాక్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వేరియంట్‌ను ఫిట్ అండ్ ఫాస్ట్ గా అభివర్ణించారు. ఇప్పటివరకు కోవిడ్‌పై వచ్చిన టీకాల్లో అత్యంత ప్రభావవంతమైనదని భావిస్తున్న ఫైజర్ టీకా డెల్టాపై 41 శాతం మాత్రమే ప్రభావం చూపుతుందని ఇజ్రాయిల్‌లో బయటపడ్డ గణాంకాలు చెబుతున్నాయి.
ఇజ్రాయిల్‌లో కరోనాతో ఆస్పత్రిలో చేరుతున్నవారిలో 60 శాతం మంది వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్నవారేనని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. యూఎస్‌లో నూతన ఇన్‌ఫెక్షన్లలో 83 శాతం డెల్టా వేరియంట్‌వే కావడం ఆందోళన కలిగిస్తోంది. ఈయూలోని మొత్తం 28 దేశాలుండగా, ప్రస్తుతం 19 దేశాల్లో డెల్టా జోరు పెరిగిందని WHO హెచ్చరించింది.
సాధారణ కోవిడ్ వేరియంట్లు సోకిన రోగి ముక్కులో ఉండే వైరల్ లోడు కన్నా వెయ్యిరెట్లు అధికంగా డెల్టా వేరియంట్ సోకిన రోగి ముక్కులో వైరస్‌లోడు ఉంటుందని చైనాలో జరిపిన మరో అధ్యయనం వెల్లడించింది. దీనివల్ల వైరస్ వ్యాప్తి మరింత వేగవంతమవుతోందని పీకాక్ విశ్లేషించారు. టీకా తీసుకున్న వారికంటే టీకా తీసుకోకుండా ఉండే వారిలో ఈ వ్యాప్తి అధికంగా ఉందని వైద్యులు తెలిపారు.
తమిళనాడు రాజకీయాల్లో తాజాగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు, రాజకీయ నేత విజయ్పై ఆస్తుల వివరాల విషయంలో…
తెలుగు బుల్లితెరలో గుర్తింపు పొందిన బిగ్‌బాస్ ఫేమ్ తమన్నా సింహాద్రి మరోసారి వార్తల్లో నిలిచారు. గతంలో నటి హేమపై వచ్చిన…
తెలుగు సినిమా ప్రపంచంలో తన ప్రత్యేక హాస్యంతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన నటుడు వేణు మాధవ్ మరణం ఇప్పటికీ అభిమానులను…
తెలుగు సినీ పరిశ్రమలో మరో ఆసక్తికర కాంబినేషన్ తెరపైకి రానుంది. యువ నటుడు బెల్లంకొండ గణేష్ హీరోగా తెరకెక్కుతున్న కొత్త…
వేసవి కాలం వచ్చేసరికి చర్మ సమస్యలు, నీరసం, డీహైడ్రేషన్ వంటి ఇబ్బందులు ఎక్కువవుతాయి. కాలుష్యం, ఒత్తిడి కలిసివచ్చే ఈ రోజుల్లో…
మన దైనందిన జీవితంలో టీకి ప్రత్యేక స్థానం ఉంది. ఉదయం లేవగానే ఒక కప్పు వేడి టీ తాగడం చాలా…