సోనూ సూద్ ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కరోనా క్లిష్ట పరిస్థితులలో సోనూసూద్ అడిగిన వారికి లేదనకుండా చేసిన సహాయం గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. ఆపదలో ఉన్న ఎంతో మందికి సహాయం చేస్తూ అందరి పట్ల రియల్ హీరో గా గుర్తింపును సంపాదించుకున్న సోనూసూద్ నిరంతరం పేదల కోసం కృషి చేస్తూనే ఉన్నారు.
కరోనా క్లిష్ట సమయంలో ఎంతో మందికి సహాయం చేసిన సోనుసూద్ తాజాగా కొత్త వ్యాపారాలను మొదలుపెట్టాడు.అయితే ఈ వ్యాపారాలు తన స్వలాభం కోసం మాత్రం కాదు. ఎంతో మంది చిన్న వ్యాపారులను ప్రోత్సహించడం కోసం సోనుసూద్ చేస్తున్న ప్రయత్నం అని చెప్పవచ్చు. ఈ విధంగా చిరు వ్యాపారులకు మద్దతిస్తూ సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
గత కొద్ది రోజుల క్రితం సైకిల్పై గుడ్లు బ్రెడ్ వంటి వాటిని అమ్మాడు. కావలసిన వారికి డోర్ డెలివరీ సదుపాయం కూడా ఉంటుందని అయితే డోర్ డెలివరీ కోసం మరింత అధిక మొత్తంలో డబ్బులు చెల్లించాల్సి ఉంటుందని సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. తాజాగా సోనుసూద్ తందూరి రోటీలను చేస్తూ.. మరోసారి అందరినీ సందడి చేశారు.
తాజాగా పంజాబీ ధాబా ఓపెన్ చేసి అందులో స్వయంగా తందూరి రోటీలు చేసి అమ్ముతున్నారు. ఈ క్రమంలోనే ఈ వీడియోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ… సోను చేసిన రోటీలను తింటే ఎప్పటికీ మరిచిపోలేని.. ఇక్కడ తిన్న తర్వాత మరెక్కాడ తినలేరు అంటూ కామెంట్ జతచేసి వీడియో పోస్ట్ చేశారు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ విధంగా చిరు వ్యాపారులను ప్రోత్సహించాలని ఈ సందర్భంగా సోనుసూద్ పిలుపునిచ్చారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…