పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొన్ని రోజుల విరామం తర్వాత వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే వకీల్ సాబ్ సినిమా ద్వారా అద్భుతమైన విజయాన్ని అందుకున్న పవర్ స్టార్ తాజాగా “హరి హర వీరమల్లు”, సాగర్ కే చంద్ర దర్శకత్వంలో మలయాళ రీమేక్ చిత్రం “అయ్యప్పన్ కోషియుమ్”తెరకెక్కుతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమాలో పవర్ స్టార్ ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు.
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మించగా సాగర్ కే చంద్రశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించి తాజా సమాచారాన్ని చిత్రబృందం తెలియజేశారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తో పాటు దగ్గుబాటి రానా కీలక పాత్రలో నటిస్తున్నారు.
ఈ సినిమాలో పవర్ స్టార్ భీమ్లానాయక్ అనే పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో సందడి చేయగా… రానా రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. దాదాపు 40 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈచిత్రం కరోనా కారణం చేత వాయిదా పడింది. నిన్నటి నుంచి ఈ చిత్రం తిరిగి షూటింగ్ లో పాల్గొన్నట్లు చిత్రబృందం తెలియజేశారు. ఈ క్రమంలోనే వీడియో మేకింగ్ గ్లింప్స్‌ను చిత్ర బృందం విడుదల చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుని వచ్చే ఏడాది సంక్రాంతి బరిలోకి దిగబోతోందని చిత్ర బృందం తెలియజేశారు.అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో నటిస్తున్నటువంటి “హరిహర వీరమల్లు” చిత్రం కూడా సంక్రాంతికే విడుదల కానున్నట్లు గతంలో ప్రకటించారు. ఈ క్రమంలోనే ఈ మల్టీ స్టారర్ మూవీ కూడా సంక్రాంతికే విడుదల అవుతుందని చెప్పడంతో హరిహర వీరమల్లు సినిమా విడుదల విషయంలో మార్పులు చోటుచేసుకోవచ్చు అని చిత్రబృందం భావిస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…