akkineni sumanth
అక్కినేని నాగేశ్వరరావు మనవడు, నాగార్జున మేనల్లుడుగా ఇండస్ట్రీలోకి వచ్చిన సుమంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ప్రేమకథ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన సుమంత్ ఆ తర్వాత సత్యం అనే సినిమా ద్వారా అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు. అయితే ఆ తర్వాత అవకాశాలు వచ్చినప్పటికీ అతనికి మాత్రం పెద్దగా గుర్తింపు తీసుకురాలేదు.
సుమంత్ ఇప్పటికీ పలు సినిమాలలో నటిస్తున్నప్పటికీ కూడా తనకు సరైన గుర్తింపు తీసుకురాలేదని చెప్పవచ్చు. ఇక సుమంత్ వ్యక్తిగత విషయానికి వస్తే దాదాపు15 ఏళ్ల క్రితం తొలిప్రేమ హీరోయిన్ కీర్తిరెడ్డిని పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. అయితే కొన్ని కారణాల వల్ల వీరిద్దరూ విడిపోయారు.ఈ విధంగా వీరిద్దరు విడిపోవడంతో కీర్తి రెడ్డి మరో వ్యక్తిని పెళ్లి చేసుకొని తన జీవితంలో సెటిల్ అయిపోయారు.
సుమంత్ మాత్రం 15 సంవత్సరాల నుంచి ఒంటరిగానే గడుపుతున్నారు. తనని మరో పెళ్లి చేసుకొమ్మని కుటుంబం సభ్యులు చెబితే సరైన వ్యక్తి దొరికితే చూద్దాం అనేవాడే కానీ దొరుకుతుందనే నమ్మకం అతనికి లేదని చెప్పేవాడు. అయితే ఇన్నాళ్లకు సుమంత్ కి సరైన వ్యక్తి దొరికిందా అంటే అవుననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు.
సుమంత్ ఎట్టకేలకు రెండవ సారి పెళ్లి చేసుకోబోతున్నారని, తాను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి పేరు పవిత్ర అని విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే సుమంత్ పెళ్లి పనులు ఎలాంటి హడావుడి లేకుండా సైలెంటుగా జరుగుతున్నాయని, చాలా తక్కువ మంది సన్నిహితులు కుటుంబ సభ్యుల మధ్య మాత్రమే వీరి వివాహం జరుగుతుందనే వార్తలు కూడా జోరుగా వినిపిస్తున్నాయి. ఈ విషయంపై అక్కినేని కుటుంబం త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…