Aadi Pinishetty : తెలుగు లో బాలకృష్ణ నాగార్జున చిరంజీవి వెంకటేష్ మోహన్ బాబు వంటి హీరోలకు సూపర్ హిట్ సినిమాలు అందించిన దర్శకుడు రవి రాజా పినిశెట్టి వారసుడిగా సినీరంగ ప్రవేశం చేశారు ఆది పినిశెట్టి. ప్రస్తుతం ఆది పినిశెట్టి తమిళ్ హీరో గా కొనసాగుతున్నారు. అయినప్పటికీ అప్పుడప్పుడూ తెలుగు సినిమాలలో కూడా ఈయన నటించారు. గుండెల్లో గోదారి లాంటి సినిమాలో హీరోగా నటించారు. అల్లు అర్జున్ హీరోగా వచ్చిన సరైనోడు సినిమా లో విలన్ గా కూడా నటించి ప్రశంసలు అందుకున్నారు. ప్రస్తుతం ఆది పినిశెట్టి రామ్ హీరోగా వస్తున్న వారియర్ సినిమాలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఆది పెళ్లి చేసుకోబుతున్నాడు అన్న వార్తలు వినిపిస్తున్నాయ్.
ఆది పినిశెట్టి – నిక్కీ గల్రానీ ల వివాహం….
యంగ్ హీరో ఆది పినిశెట్టి త్వరలో పెళ్లిచేసుకోబోతున్నాడు. హీరోయిన్ నిక్కీ గల్రానీ ఆది పినిశెట్టి గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్న సంగతి తెలిసిందే.ఆది, నిక్కీ.. జంటగా నటించిన ‘యాగవరైనమ్ నా కక్కా’సమయంలోనే ప్రేమలో పడ్డారు . ఇది తెలుగులో మలుపు పేరుతో విడుదలైంది.ఇంకా మరగద నానయం సినిమాలోనూ వీరు కలసి నటించారు. కుటుంబ సభ్యుల సమక్షంలో మార్చి 24న నిశ్చితార్థం జరుపుకున్న వీరు మరికొద్ది రోజుల్లో ఏడడుగులు వేయనున్నారు . వీరి పెళ్లికి ముహూర్తం ఫిక్స్ అయ్యింది అంటూ సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది . మే 18న చెన్నైలోని ఫైవ్ స్టార్ హోటల్‌లో వీరి వివాహం జరగబోతోంది అని సమాచారం.
నిశ్చితార్థం సింపుల్ గా చేసుకున్న ఈ జంట పెళ్లి ని ఘనంగా అతిథుల మధ్యలో జరుపుకోవాలని బావిస్తున్నారట.ఫైవ్ స్టార్ హోటల్ వేదిక గా వీరి వివాహం జరగబోతోంది.అయితే దీని గురించి అధికారిక సమాచారం రావాల్సి వుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…