Aadi Saikumar: ప్రముఖ నటుడు సాయికుమార్ వారసుడిగా ప్రేమ కావాలి సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా అడుగుపెట్టిన ఆది గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మొదటి సినిమాతోనే ఆదికి మంచి గుర్తింపు లభించింది. అయితే ఆ తర్వాత ఆది నటించిన సినిమాలు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోతున్నాయి.
అయినప్పటికీ అది మాత్రం తన ప్రయత్నాలు విరమించుకోకుండా ప్రేక్షకులను ఆకట్టుకొని స్టార్ హీరోగా నిలదొక్కుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇదిలా ఉండగా ఇటీవల అది తన భార్య అరుణతో కలిసి మొదటిసారిగా టీవీ షోలో పాల్గొన్నాడు..వెన్నెల కిషోర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ” అలా మొదలైంది ” షో లో ఆది, అరుణ సందడి చేశారు.
ఆది, అరుణ ది పెద్దలకుదురుచిన వివాహం. ఈ షోలో వీరిద్దరూ తమ వైవాహిక జీవితం గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో వారి పెళ్లిచూపులు ఎయిర్పోర్టులో జరిగాయని, అయితే మొదటి మీటింగ్ లోనే గంటలు తరబడి మాట్లాడటంతో వారి పేరెంట్స్ అడ్డుగా వచ్చారని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా పెళ్లి తర్వాత హనీమూన్ కి వెళ్ళినప్పుడే ఇద్దరు గొడవపడ్డారని తెలిపారు.
ఇక ఆది భార్య అరుణ మాట్లాడుతూ.. ఇంట్లో ఆది డామినేషన్ ఎక్కువగా ఉంటుందని, ఇప్పటివరకు తన ఫోన్ పాస్వర్డ్ కూడా చెప్పలేదని తెలిపింది. దీంతో ఆది స్పందిస్తూ ఫోన్ పర్సనల్ కాబట్టి నేను ఎప్పుడూ తనకి ఫోన్ ఇవ్వను అని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా ఆది కి సర్ప్రైజ్ గిఫ్ట్ లు ఇవ్వలేదని, తాను ఇచ్చిన గిఫ్టులు కూడా పోగొట్టాడని అరుణ తెలిపింది. ఆది చేతుల మీద ఓ ఆమ్లెట్ వేయించుకుని తినాలనే తన కోరిక ఇప్పటికి నెరవేరలేదని అరుణ చెప్పింది. దీంతో వెన్నెల కిషోర్ తాను సహాయం చేస్తానని చెప్పి ఆదిని కష్టపెట్టే ఒక ఆమ్లెట్ వేయించాడు. మొత్తానికి ఇలా అరుణ కోరిక నెరవేరింది. అయితే ఈ విషయం గురించి తెలిసిన నెటిజన్లు ఇలాంటి చిన్నచిన్న కోరికలు కూడా ఉంటాయా? అని కామెంట్స్ చేస్తున్నారు.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…