శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయి పల్లవి జంటగా తెరకెక్కిన చిత్రం లవ్ స్టోరీ. ఈచిత్రం కరోనా రెండవ దశ రాకముందే విడుదల కావాల్సి ఉండగా.. థియేటర్లు మూత పడటంతో ఈ సినిమా విడుదల వాయిదా పడుతూ వస్తోంది. ఎట్టకేలకు ఈ సినిమాకు ఏర్పడిన అడ్డంకులను ఇంటిని తొలగించుకొని ఈనెల 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ క్రమంలోనే నేడు(ఆదివారం) హైదరాబాద్ లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఎంతో అంగరంగ వైభవంగా ఏర్పాటు చేశారు. హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన ఈ వేడుకకు బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ విధంగా ఆదివారం ఉదయం హైదరాబాద్ చేరుకున్న ఈ నటుడు నాగచైతన్యతో కలిసి గ్రీన్ ఇండియా చాలెంజ్ లో నాగచైతన్యతో కలిసి మొక్కలు నాటారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సింగర్ మంగ్లీ పాల్గొని లవ్ స్టోరీ సినిమాలో ఎంతో ఫేమస్ అయినటువంటి సారంగదరియా పాటను ఆలపించగా అందుకు సాయిపల్లవి రెట్టింపు ఉత్సాహంతో మరోసారి స్టేజ్ పై చిందులు వేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సుద్దాల అశోక్ తేజ లిరిక్స్ అందించిన ఈ పాట ఇప్పటికి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంది.
ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్ లు, టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుని సినిమాలపై అంచనాలు పెంచాయి. ఈ క్రమంలోనే ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా సెప్టెంబర్ 24వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిత్ర బృందం పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ప్రేక్షకుల కోసం మరోసారి సాయి పల్లవి వేదికపై సారంగదరియా స్టెప్పులతో.. అందరినీ సందడి చేసింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…