టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత అక్కినేని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.సమంత సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ తనకు ఏమాత్రం విరామం దొరికిన తన స్నేహితులతో కలిసి ఎంతో సరదాగా గడుపుతుంటారు. సమంతకు ఇండస్ట్రీలో కేవలం అతి కొంతమంది స్నేహితులు మాత్రమే ఉన్నారు. వీటిలో వెన్నెల కిషోర్ ఒకరు. ఈ క్రమంలోనే నేడు (సెప్టెంబర్ 19)వెన్నెల కిషోర్ పుట్టినరోజు కావడంతో వెన్నెల కిషోర్ కు పెద్ద ఎత్తున అభిమానులు ఇతర సెలబ్రిటీలు నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.
ఈ క్రమంలోనే వెన్నెల కిషోర్ పుట్టినరోజు సందర్భంగా సమంత అతనికి పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియజేశారు. ప్రస్తుతం సమంత చెన్నైలో ఉండగా.. నిన్ననే ఈమె తిరుపతి, శ్రీకాళహస్తి దైవ దర్శనాలు చేసుకుని తిరిగి చెన్నై వెళ్లారు. నేడు వెన్నెల కిషోర్ పుట్టినరోజు కావడంతో సమంత అతనికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ క్రమంలోనే వెన్నెల కిషోర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ.. హ్యాపీ బర్త్డే వెన్నెల కిషోర్.. నిన్ను ఎంతో మిస్ అవుతున్నాను.. నిన్ను ఆ దేవుడు చల్లగా చూడాలి..నువ్వు నీ పక్కవారిని ఎలా అయితే నవ్విస్తావో ఆ దేవుడు కూడా నిన్ను అలా నవ్వించే వారి మధ్యలో ఉంచాలని ప్రార్థిస్తున్నాను అంటూ అంటూ వెన్నెల కిషోర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడంతో సమంత విషెస్ కు స్పందిస్తూ వెన్నెల కిషోర్ తిరిగి రిప్లై ఇచ్చాడు.
నీ శుభాకాంక్షలు ఈరోజు నాకు ఎంతో ప్రత్యేకంగా మారాయి నిన్ను ఎంతో మిస్ అవుతున్నాను అంటూ వెన్నెల కిషోర్ హగ్స్ ఎమోజీలను షేర్ చేశారు. మొత్తానికి సమంత ఇలా తన స్నేహితుడి కోసం భగవంతుడిని ప్రార్థిస్తూ అతనికి ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు చెప్పడం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…