Aamir Khan: బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో అమీర్ ఖాన్ పరిచయం అందరికీ తెలిసిందే. ఎన్నో సినిమాలలో నటించి స్టార్ హోదాకు చేరుకున్నాడు. తన నటనతో మంచి మార్కులు సంపాదించుకొని హిందీ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకులను కూడా అభిమానులుగా మార్చుకున్నాడు. ఇక ఈయన గతంలో వ్యక్తిగతంగా కూడా బాగా హాట్ టాపిక్ గా నిలిచిన సంగతి తెలిసిందే.
ఇక ఇదంతా పక్కన పెడితే తాజాగా అమీర్ ఖాన్ కి సంబంధించిన ఒక ఫోటో బాగా వైరల్ అవుతుంది. అదేంటంటే తాజాగా రాజస్థాన్ జైపూర్ లో ది వాల్డ్ డిస్నీ కంపెనీ ఇండియా, స్టార్ ఇండియా అధ్యక్షుడు కే మాధవన్ కుమారుడి పెళ్లి జరిగింది. ఇక ఈ పెళ్లి వేడుకకు బాలీవుడ్, మాలీవుడ్ సినీ ప్రముఖులు పాల్గొన్నారు. స్టార్ హీరోలు సైతం తమ ఫ్యామిలీ లతో పాల్గొని బాగా సందడి చేశారు.
అయితే ఆ వేడుకకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో అందులో అమీర్ ఖాన్ కూడా ఉండగా ఈయనపై అందరూ ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. అందులో సాంప్రదాయ దుస్తుల్లో కనిపించగా.. ఆయన వాక్ స్టిక్ సాయంతో నిలబడినట్లు కనిపించాడు. దీంతో ఆయనను చూసిన తన అభిమానులు అమీర్ ఖాన్ కు ఏమయ్యింది అంటూ ఆందోళన చెందుతున్నారు.
ఆయన కాలికి ఏమైనా దెబ్బ తగిలిందా అని భయపడుతున్నారు. మరి కొంతమంది ఆయన కావాలని నటిస్తున్నాడు అంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే ఇదంతా పక్కన పెడితే ఇటీవలే ఈయన సినిమాలకు కాస్త బ్రేక్ తీసుకుంటున్నాను అని చెప్పటంతో.. బహుశా ఆయన కాలు సరిగ్గా లేనందుకే బ్రేక్ తీసుకుంటున్నాడేమో అని అనుకుంటున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…