Senior producer Natti kumar : నందమూరి తారకరత్న కుప్పంలో జరిగిన నారా లోకేష్ పాదయాత్రలో పాల్గొనడానికి వెళ్లి అక్కడ పాదయాత్ర చేస్తున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోవడం, ఆ తరువాత మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకి తరలిండం చకచకా జరిగిపోయాయి. తారకరత్న గుండె కొట్టుకోవడం ఆగిపోవడంతో 45 నిమిషాల పాటు మళ్ళీ గుండె కొట్టుకునేలా కుప్పం వైధ్యులు శ్రమించారు. ఇక అక్కడినుండి బెంగళూరు నారాయణ హృదయాలయకు తీసుకెళ్లి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నట్లు చెబుతున్నా ఇంకా పరిస్థితి క్రిటికల్ గా ఉందంటూ తెలుస్తోంది. ఇక ఆయన విషయంలో అసలు ఏం జరుగుతోంది అనే వివరాలను సీనియర్ నిర్మాత నట్టి కుమార్ తెలిపారు.
ఆయన పరిస్థితి క్రిటికల్ గా ఉంది…
నట్టి కుమార్ మాట్లాడుతూ తారకరత్న ను మెరుగైన చికిత్స కోసం అమెరికా తరలించారు అంటూ వచ్చిన వార్తలు అవాస్తవం అని ఆయన బెంగళూరు లోనే చికిత్స తీసుకుంటున్నారని తెలిపారు. ఆయన మొదట గుండె కొట్టుకోవడం ఆగి పోయినపుడు బాలకృష్ణ గారు గట్టిగా మాట్లాడించారని, అది మృత్యుంజయ మంత్రం చదివారో లేక మాట్లాడించారో తెలియదు కానీ ఆయన అలా మాట్లాడించాకే మళ్ళీ తారకరత్న లో చలనం వచ్చింది అని చెప్పారు.
ప్రస్తుతం చికిత్స కు స్పందిస్తున్నా ఇంకా పరిస్థితి విషమంగానే ఉంది అంటూ నట్టి కుమార్ తెలిపారు. బ్రెయిన్ కి ఏంఆర్ఐ స్కాన్ తీసి అసలు బ్రెయిన్ ఎంత పాడైంది అని తెలిసిన తరువాత చికిత్స అందిస్తారని చెప్తూ అయితే తారక రత్న ఈ గండం నుండి బయటపడతాడు అంటూ తెలిపారు. తన తాత నాన్నమ్మల ఆశీస్సులు ఎపుడూ ఉంటాయి కాబట్టి కోలుకుని తిరిగి వస్తాడు అంటూ తెలిపారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…