Abhishek Nama : సినిమా కోసం కథ రెడీ చేసుకుని, నటినటుల ఎంపిక చేయడం అన్ని అయ్యాయి అనుకున్నాక షూటింగ్, ఏ ఇబ్బందులు లేకుండా అన్ని జరిగిన సినిమా బిజినెస్ అవ్వడం చాలా ముఖ్యం. హీరో మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని సినిమా బిజినెస్ జరుగుతుంది. అయితే ఇక్కడ బిజినెస్ జరగగానే హీరో, డైరెక్టర్ వీళ్లంతా వారి పనికి డబ్బులు తీసుకున్న సినిమా ఫలితం వల్ల ప్రభావితం అయ్యేది డిస్ట్రిబ్యూటర్లు అలాగే థియేటర్ యాజమానులు. ఇక ఈవిషయంలో డిస్ట్రిబ్యూటర్ల సంగతి చెప్పక్కర్లేదు. సినిమా డిజాస్టర్ గా మిగిలితే వాళ్ళ పరిస్థితి కష్టం. అలాంటి సమయంలో సదరు హీరో, డైరెక్టర్ బాధ్యత తీసుకుని వారికి భరోసా ఇవ్వడం వంటివి చేస్తుంటారు.

విజయ్ దేవరకొండ కి బాధ్యత లేదు…
సినిమా డిస్ట్రిబ్యూషన్ లో ఉంటూ అలాగే నిర్మాత సాక్ష్యం, గూఢచారి వంటి సినిమాలో పాలుపంచుకున్న అభిషేక్ నామా డిస్ట్రిబ్యూటర్ కష్టాలను గురించి మాట్లాడారు. ఇక హీరో విజయ్ దేవరకొండ గురించి ఆసక్తికర వాఖ్యలు చేసారు. ఈ మధ్యలో డిస్ట్రిబ్యూషన్ వల్ల నష్టపోయిన సినిమా గురించి మాట్లాడుతూ విజయ్ దేవరకొండ నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా గతేడాది విడుదల అయి డిజాస్టర్ గా మిగిలింది. అర్జున్ రెడ్డి వల్ల విజయ్ మార్కెట్ పెరగడం వల్ల లాభాలు వస్తాయని నమ్మి డిస్టిబ్యూషన్ తీసుకుంటే 10% లాభాలు కూడా రాలేదు.

బాగా నష్టపోయి ఏమి చేయాలో తెలియని స్థితిలో హీరో బాధ్యత తీసుకోవాలి కదా కానీ విజయ్ కనీసం స్పందించలేదు. ఫోన్ చేస్తే ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసాడు. అలా బాధ్యతరహిత్యంగా ఉంటే ఎలా ఆ ఒక్క సినిమాతో అయిపోదు కదా కనీసం డబ్బుల సహాయం కాకపోయినా నెక్స్ట్ సినిమా డిస్ట్రిబ్యూషన్ సమయంలో అయినా హామీ ఇవ్వలేదు. సినిమా విషయంలో హీరో ని చూసి, డైరెక్టర్ ను చూసి మాత్రమే డిస్ట్రిబ్యూటర్లు కొంటారు వాళ్ళు ఇలా బాధ్యత రహిత్యంగా ఉంటే ఇక డిస్ట్రిబ్యూటర్ల విషయంలో ప్రభుత్వం కూడా ఏమి చేయడానికి లేదు ఇదొక జూదం లాంటింది అంటూ చెప్పడు అభిషేక్ నామా.




























