Acharya movie : రామ్ చరణ్, మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఆచార్య. తాజాగా ఆర్ఆర్ఆర్, కేజీఫ్ ఇలాంటి పాన్ ఇండియా సినిమాలు చూసిన అభిమానులు ఆచార్య సినిమాలు విడుదలయ్యాక టాక్ ని చూసి టికెట్ బుక్ చేసుకోవాలి అనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అందుకే కాబోలు ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడడం లేదు. అంతే కాకుండా మరో వైపు ఈ సినిమాకు నెగిటివ్ సెంటిమెంట్స్ కూడా వెంటాడుతున్నాయి.

రాజమౌళి సినిమాలో నటించిన హీరో తర్వాత సినిమా ఖచ్చితంగా ఫ్లాప్ అవుతుంది అన్న సెంటిమెంట్ సినిమాను ఎక్కువగా వెంటాడుతోంది. మరొక కారణం పూజాహెగ్డే నటించడం. ఈ నెగిటివ్ సెంటిమెంట్లు అభిమానులను వెంటాడుతున్నాయి. అయితే ఈ ఏడాదిలో విడుదలైన కిలాడి సినిమా మినహాయించి మిగతా సినిమాలన్నీ మంచి విజయాలను సాధించాయి. కాబట్టి చరణ్ మెగాస్టార్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావున కచ్చితంగా విజయం సాధిస్తుందని అభిమానులు మరోవైపు నమ్మకంగా ఉన్నారు. అందులోనూ కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన సినిమా ఇంతవరకు ప్రేక్షకులను నిరాశ పరచలేదు అన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి.
సోను సూద్ విలన్ గా కనిపిస్తే మనవాళ్ళు ఒప్పుకుంటారా….
ఆచార్య సినిమాలో విలన్ గా నటించిన సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు సోనూసూద్ ఒక రియల్ హీరో. అలాంటిది సోను సూద్ ను ఆచార్య సినిమాలో విలన్ గా ప్రేక్షకులు ఆదరిస్తారా లేదా అన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఒకవేళ ప్రేక్షకులు సోనూసూద్ విలన్ గా పెంచకపోతే సినిమాకు నష్టం కలగవచ్చు అని అనుమానాలు కూడా వస్తున్నాయి.
అయితే ఆచార్య సినిమాల్లో చాలా ప్రత్యేకతలు ఉన్నప్పటికీ చిత్రాబృందం వాటిని బయట పెట్టట్లేదు. ఇంటర్వెల్ సీన్ మరియు క్లైమాక్స్ సన్నివేశాలు చిత్రానికి హైలెట్గా నిలుస్తాయని వాదనలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలో మరో విశేషం ఏమిటంటే గెస్ట్ రోల్ లో అనుష్క శెట్టి నటిస్తోంది అన్న వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది.






























