Chitti Babu: టాలీవుడ్ ఇండస్ట్రీలో నిర్మాతగా కొనసాగుతున్నటువంటి చిట్టిబాబు తాజాగా ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగింపు వివాదం పై స్పందించారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను అభిమానులు ఏర్పాటు చేయగా అక్కడికి వచ్చినటువంటి బాలయ్య వెంటనే ఆ ఫ్లెక్సీలను తొలగించమని చెప్పిన సంగతి తెలిసిందే.
ఇలా బాలయ్య ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించమని చెప్పడంతో ఎన్టీఆర్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే తాజాగా ఈ వివాదం పై చిట్టిబాబు స్పందించారు. ఏ పని పాట లేని ఎదవలు ఇలాంటి ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి పెట్టారని బాలయ్య కనుక తీసేయమని చెప్పారు అది నేను కనుక ఉంటే చెప్పుతోనే అలాంటి ఎదవలను కొట్టేవాడిని అంటూ ఈయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఎవరైనా చనిపోయిన వారి ఘాట్ వద్ద వారి ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తారు కానీ బ్రతికున్న వారి ఫ్లెక్సీలను ఏర్పాటు చేయరని ఇలా చేసే వాళ్లకు ఎలాంటి పని పాట లేదని ఈయన తెలిపారు. ఒకవేళ ఫ్లెక్సీలు పెట్టాలి అనుకుంటే సీనియర్ ఎన్టీఆర్ గారివి పెట్టి ఉంటే సరిపోయేదని తెలిపారు.
అడ్డుకునే శక్తి లేదు…
ఇక ఎన్టీఆర్ రాజకీయాల గురించి కూడా చిట్టిబాబు మాట్లాడారు ఎన్టీఆర్ ను రాజకీయాల పరంగా తొక్కేసే ప్రయత్నం చేస్తున్నారని ప్రశ్న ఎదురుగా ఎన్టీఆర్ రాజకీయాలలోకి రావాలి అనుకుంటే ఆయనని ఆపగలిగే శక్తి ఎవరికీ లేదని చిట్టిబాబు తెలిపారు. అయితే ఎన్టీఆర్ ప్రస్తుతం రాజకీయాల కంటే సినిమాల పైన ఆసక్తిగా ఉన్నారని అందుకే ఆయన రాజకీయాలలోకి రావడం లేదంటూ చిట్టిబాబు చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…