Actor J. D. Chakravarthy : నేను మందు తాగకపోడానికి ఆర్జివి ఒక కారణం….: నటుడు జేడి చక్రవర్తి

0
56

Actor J. D. Chakravarthy : శివ సినిమాతో తెలుగులో పరిచయమైన నాగులపాటి శ్రీనివాస చక్రవర్తి కంటే జేడి చక్రవర్తి అనగానే ప్రేక్షకులకు గుర్తోస్తాడు. మొదటి సినిమా క్యారెక్టర్ పేరును తన పేరులో పెట్టుకున్న జే డి చక్రవర్తి శివ, సత్య, దెయ్యం, ఎగిరే పావురమా, మనీ, మనీ మనీ అంటూ పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. గురువు ఆర్జీవి బాటలో హిందీలో అనేక సినిమాల్లో నటించిన జేడీ, అటు తమిళం, కన్నడ, మాలయాళం సినిమాల్లో నటించారు. అలాగే దర్శకత్వం కూడా కొన్ని సినిమాలకు చేసారు. తాజాగా డిస్నీ హాట్ స్టార్ లో దయ అనే వెబ్ సిరీస్ లో నటించారు. ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూ లో తన కెరీర్ అలాగే వ్యక్తిగత విషయాలను మాట్లాడారు.

మందు, సిగరెట్ అసలు ముట్టుకోను…

నేనే మత్తులో ఉన్నాను ఇంకెందుకు మత్తు అంటూ చాలా ఇంటర్వ్యూ లో చెబుతుంటాను కానీ నేనసలు మందు తాగలేదు అంటూ జేడి చకవర్తి ఇటీవల ఒక ఇంటర్వ్యూ తెలిపారు. తాను ఇంటర్ చదివే సమయంలోనే ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన మందు, సిగరెట్ అలవాటు కాలేదని చెప్పారు. తన గురువు రామ్ గోపాల్ వర్మ గురించి బయట ఏదో అనుకుంటారు కానీ తనతో పనిచేసిన సమయంలో నన్ను ఈరోజు మందు తాగుతావా అని కానీ తాగు అని కానీ చెప్పలేదు. ఇప్పటి వరకు నాకు మందు తాగాలని అనిపించలేదు.

వాటి మీద నాకు కోరిక లేదు అందుకే వాటి జోలికి నేను పోలేదంటూ చెప్పారు జేడి. మందు తాగేవాళ్లంతా చెడ్డ వాళ్ళు, తాగని వారంతా మంచి వాళ్ళు అని నేను చెప్పను కానీ ఇండస్ట్రీ లో ఎంతో మంది నన్ను మందు తాగాక పోతే అంతే అంటూ బయపెట్టారు కానీ నేను ముట్టుకోలేదు. ఇక మన బాధను మర్చిపోడానికి మందు పనికొస్తుందని నేను నమ్మను మత్తు దిగాక మన బాధ మళ్ళీ గుర్తొస్తుంది మరింత రెట్టింపుతో గుర్తొస్తుంది అలాంటప్పుడు దాని అవసరం లేదనిపించింది అంటూ జేడి చక్రవర్తి తెలిపారు.