Actor Janardhan Rao : తెలుగు సినిమాల్లో కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించిన పోలాప్రగఢ జనార్దన్ రావు గారు తన సినిమా విశేషాలను ఇటీవల ఇంటర్వ్యూలో పంచుకున్నారు. జెన్నీ గా బాగా ప్రాచుర్యం పొందిన ఈయన సినిమాలే కాకుండా పలు సీరియల్స్ లో కూడా నటించారు. ఈసిఐఎల్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా పని చేశారు, పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్సు లోకుడా పని చేసారు. ఒక 3 నెలల పాటు యాక్టింగ్ కోర్స్ కుడా చేసిన ఈయన ఆ అనుభవంతో ఎన్నో చిత్రాలలో, సీరియల్స్ లో మరియు ఎన్నో వేల స్వదేశీ, విదేశీ సినిమా కార్యక్రమాలలో పాల్గొన్నారు.
బ్రహ్మానందంతో గొడవ… 20 మంది కమెడియన్స్ తో మీటింగ్…
చాలా ఏళ్ల క్రితం సినిమాల్లో అందరు కమెడియన్స్ కి మంచి అవకాశాల వచ్చాయి. ఈవివి, జంధ్యాల గారి సినిమాల వల్ల ఎంతో మంది కమెడియన్స్ వచ్చారు. అలా జెన్నీ గారు చాలా మంది కమెడియన్స్ బ్రహ్మానందం, సుత్తివేలు, కోటా శ్రీనివాస్రావు, బాబు మోహన్, గుండు హనుమంతరావు, ఏవిఎస్ వంటి వారితో కలిసి చాలా సినిమాల్లో చేసారు. ఇక అలాంటి సమయంలోనే బ్రహ్మానందంతో క్లాష్ వచ్చిన వారందరూ కలిసి 20 మంది కమెడియన్స్ ఏవిఎస్ ఆధ్వర్యంలో ఒక మీటింగ్ పెట్టుకున్నారు. ఆ మీటింగ్ కి నేను వెళ్ళలేదు.
ఆ తరువాత ఒకసారి ఒక సినిమా షూటింగ్ లో బ్రహ్మానందం కనిపించి మీటింగ్ కి నువ్వెందుకు వెళ్ళలేదు అని అడిగారు. నిజానికి చెప్పాలంటే నన్ను అసలు ఎవరూ పిలవలేదు. ఒకవేళ పిలుచుంటే వెళ్ళున్ఫెవాడినేమో తెలియదు. ఆ మీటింగ్ కి మీతో గొడవ జరిగిన వాళ్ళు వెళ్లారు నాకు మీతో గొడవ ఏం లేదు కాబట్టి నన్ను పిలవలేదేమో అని నిర్మొహమాటంగా చెప్పడంతో బ్రహ్మానందం అదీ నిజమేలే అని అన్నారు అంటూ అప్పటి సంఘటన గురించి జెన్నీ తెలిపారు. ఇక ఆ గొడవ చిరంజీవి వద్దకు వెళ్ళిందని ఆయన సర్దుబాటు చేసి మీడియా వరకు వెళ్ళకండి అని నచ్చజెప్పడంతో సద్దుమణిగిందంటూ చెప్పారు. జనార్దన్ రావు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…