Movie News

Krishna Vamsi: ఎమోషన్స్ పండటం కోసం హీరోకి మద్యం తాగించిన డైరెక్టర్ కృష్ణ వంశీ… ఎవరా హీరో?

Krishna Vamsi: సాధారణంగా ఒక సినిమాని తెరకెక్కించే సమయంలో ప్రతి ఒక్క సన్నివేశం చాలా క్లుప్తంగా ఉండాలని దర్శకులు ఎంతో కష్టపడుతూ ఉంటారు. అయితే ఒక సన్నివేశం చాలా సహజంగా మంచి ఎమోషన్స్ తో ఉండటం కోసం డైరెక్టర్ కృష్ణవంశీ ఎంతటి సాహసానికైనా వెనకాడరు.ఎంతగా అంటే సన్నివేశం సరిగా రావడం కోసం హీరోకు రెండు పెగ్గులు తాగించడం కూడా కరెక్టే అనేలా ఈయన వ్యవహార శైలి ఉంటుంది.

ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి కృష్ణవంశీ జగపతిబాబు నటించిన అంతఃపురం సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలలో చాలా ఎమోషన్స్ పండాల్సి ఉంది. అయితే ఈ ఎమోషన్స్ రావడం కోసం ఈయన ఏకంగా నటుడు జగపతిబాబుకి మద్యం తాగించారని వెల్లడించారు.

జగపతి బాబు క్యారెక్టర్ బాగా వచ్చేందుకు.. అతను సీన్స్ చేసేటప్పుడు తానే టకీలా షాట్స్ ఇచ్చినట్లు కృష్ణవంశీ వెల్లడించారు. జగపతిబాబుకి కంట్రోల్ చేసుకునే కెపాసిటీ ఉంది కనుక తనకు ఇలా మద్యం తాగించానని తెలిపారు.ఇలా చేయటం వల్ల ఆ సన్నివేశాలు ఎంతో సహజసిద్ధంగా వచ్చాయని ఇప్పటికే ఆ సన్నివేశాల గురించి జనాలు గుర్తు చేసుకుంటూ ఉంటారని కృష్ణవంశీ తెలిపారు.

Krishna Vamsi: జగపతిబాబుకు కంట్రోల్ చేసుకునే కెపాసిటీ ఉంది..

ఇలా జగపతి బాబుకి ఆ కెపాసిటీ ఉంది కనుక తనతో ఇలా చేయించాను కానీ సినిమా షూటింగులకు మద్యం తాగి రావడం పూర్తిగా తప్పని తెలిపారు. అంత:పురం సినిమాలో క్యారెక్టర్‌ మరింత వైల్డ్‌గా ఉండేందుకు అలా చేశామని తెలిపారు.ఇలా అంతపురం సినిమా గురించి జగపతిబాబు క్యారెక్టర్ గురించి ఈ సందర్భంగా కృష్ణవంశీ చేసినటువంటి ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago