Featured

Senior Heroine Bhanu Priya : నా డాన్స్ చూసి చిరంజీవి ఏమనేవాడంటే…: సీనియర్ హీరోయిన్ భానుప్రియ

Senior Heroine Bhanu Priya : వంశీ దర్శకత్వంలో వచ్చిన ‘సితార’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయింది భానుప్రియ. తరువాత కె.విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘స్వర్ణకమలం’ సినిమాతో మంచి పేరు సంపాదించుకుంది. స్వతహాగా నాట్య కళాకారిణి కావాడం మరో విశేషం. భానుప్రియ తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ భాషలలో దాదాపు 110 చిత్రాలలో నటించింది. తెలుగులో దాదాపుగా అగ్రహీరోల అందరి సరసనా నటించింది. సినిమా పరిశ్రమలో ఆమె జీవితం సాఫీగా సాగిపోయినప్పటికీ వ్యక్తిగత జీవితంలో మాత్రం చాలా ఒడిదుడుకులు ఎదుర్కొంది.

నా డాన్స్ చూసి చిరు ఏమన్నాడంటే…

అప్పట్లో మంచి డాన్సర్ గా పేరు తెచ్చుకున్న భాను ప్రియ ఎంతటి కష్టమైన స్టెప్స్ అయినా అలవోకగా అలానే ఫుల్ గ్రేస్ తో వేసే హీరోయిన్ గా గుర్తింపు ఉంది. మెగాస్టార్ చిరంజీవి తనకు డాన్స్ లో ఛాలెంజింగ్ అనిపించేది రాధ, భానుప్రియ లతో డాన్స్ ఇచ్చేసినపుడే అని పలు ఇంటర్వ్యూల్లో కూడా చెబుతారు. అంత గ్రేస్ తో డాన్స్ చేసే భానుప్రియ గారితో చిరు సాంగ్స్ లో డాన్స్ చేసినపుడు చాల ఈజీగా, చాలా బాగా చేస్తావ్ నువ్వు డాన్స్ అంటూ చెప్తారట.

ఈ విషయాన్ని హీరోయిన్ భానుప్రియ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. స్వతహాగా డాన్సర్ అవడం అలానే డాన్స్ మీద ఆసక్తి ఎక్కువగా ఉండటం వల్ల డాన్స్ బాగా చేస్తానంటూ చెప్పారు. ఆమె డాన్స్ తో పాటు అభినయానికి ఎన్నో అవార్డులు అలాగే అభిమానులు ఉన్నారు. ప్రస్తుతం ప్రాముఖ్యత ఉన్న పాత్రల్లోనే నటించాలని భావిస్తున్న భానుప్రియ గారు వెండి తెరకు దూరంగా ఉన్నారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago