Rakshita: సోషల్ మీడియా బాగా అభివృద్ధి చెందిన తర్వాత సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వారు మాత్రమే కాకుండా ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా వెంటనే తెలిసిపోతుంది. ముఖ్యంగా సెలబ్రిటీలు సోషల్ మీడియాలో వారికి సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు.ఈ క్రమంలోనే సెలబ్రిటీలు ఏదైనా పార్టీకి వెళ్లిన వెకేషన్ కి వెళ్ళిన అందుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటారు.
ఇదిలా ఉండగా తాజాగా బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ చిన్న పార్టీని అరేంజ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ పార్టీలో భాగంగా ఇతర సెలబ్రిటీలతోపాటు ఇడియట్ హీరోయిన్ రక్షిత కూడా పాల్గొని సందడి చేశారు. ఈ క్రమంలోనే ఈ పార్టీకి సంబంధించిన ఫోటోలను రక్షిత సోషల్ మీడియాలో షేర్ చేశారు.ఇలా ఈ పార్టీకి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ సంతోషాన్ని వ్యక్తం చేయడమే కాకుండా సంజయ్ లవ్లీ పర్సన్ అంటూ ఫోటోలను షేర్ చేశారు.
ఇక సంజయ్ సైతం కేవలం బాలీవుడ్ చిత్రాలు మాత్రమే కాకుండా గత ఏడాది విడుదలైన కే జి ఎఫ్ 2 సినిమాలో నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో సంజయ్ దత్ అధీరా క్యారెక్టర్‌లో క్రూరమైన గెటప్‌లో ఆయన నటన ఆకట్టుకుంది. రక్షిత శాండల్ వుడ్ డైరెక్టర్ ప్రేమ్‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత ఈమె కూడా పూర్తిగా సినిమాలకు గుడ్ బై చెప్పారు.
ఇలా సినిమాలకు దూరమైన రక్షిత కన్నడ టీవీ షోలలో సందడి చేశారు. అయితే ఈమె ఈ మధ్యకాలంలో అధిక శరీర బరువు పెరగడంతో పూర్తిగా తన రూపురేఖలు కూడా మారిపోయాయి. దీంతో ఈమె ఫోటోలు చూసినటువంటి అభిమానులు రక్షిత ఏంటి ఇలా మారిపోయారు అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం రక్షిత షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…
ఒకప్పుడు వెన్నునొప్పి, మెడ నొప్పి, వెన్నెముక సమస్యలు అంటే 50 ఏళ్లు దాటిన వారిలోనే ఎక్కువగా కనిపించేవి. వయసు పెరగడం,…
వైద్య శాస్త్రం రోజురోజుకూ కొత్త మైలురాళ్లు చేరుకుంటోంది. ఒకప్పుడు నయం చేయలేని వ్యాధులకు మందులు కనుగొన్న శాస్త్రవేత్తలు ఇప్పుడు వ్యాధులు…
ఈ రోజుల్లో చిన్నవాళ్ల నుంచి పెద్దవాళ్ల వరకు చాలా మందిని వేధిస్తున్న సమస్యల్లో అధిక బరువు ఒకటి. పని ఒత్తిడి,…
సినిమా అంటే అంకితభావం. పాత్ర అంటే బాధ్యత. ప్రేక్షకుల ముందు కనిపించే ప్రతి సన్నివేశం పరిపూర్ణంగా ఉండాలనే తపన. ఇవన్నీ…
నేటి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన కొద్దీ యోగా చేసే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. శారీరక ఆరోగ్యంతో పాటు…