Movie News

K Viswanath: విశ్వనాథ్ అంత్యక్రియలపై అసంతృప్తి వ్యక్తం చేసిన అభిమానులు… సరైన గౌరవం ఇవ్వలేదంటూ?

K Viswanath: లెజెండరీ డైరెక్టర్, దర్శక దిగ్గజలు కే విశ్వనాథ్ గత గురువారం అనారోగ్య సమస్యలతో మరణించిన విషయం మనకు తెలిసిందే.92 సంవత్సరాలు వయసు కలిగినటువంటి విశ్వనాథ్ గారు వయో వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ అపోలో ఆసుపత్రిలో మరణించారు. ఇక ఈయన అంత్యక్రియలను శుక్రవారం నిర్వహించారు.

తెలుగు చిత్ర పరిశ్రమకు ఎన్నో సేవలు అందించిన విశ్వనాథ్ గారు ఎన్నో అవార్డులను పురస్కారాలను అందుకున్నారు. ఇలాంటి దిగ్గజ దర్శకులు మరణించడం ఇండస్ట్రీకి తీరని లోటు అని చెప్పాలి అయితే విశ్వనాథ్ గారు మరణించడంతో ఎంతోమంది సినీ రాజకీయ ప్రముఖులు కూడా ఈయన మృతికి సంతాపం తెలియజేశారు.ఇక ఈయన అంత్యక్రియలు పంజాగుట్టలోని స్మశాన వాటికలో బ్రాహ్మణ కుటుంబ సాంప్రదాయాల ప్రకారం జరిగాయి.

ఇలా స్మశాన వాటికలో విశ్వనాథ్ గారి అంత్యక్రియలు సాధారణంగా జరగడం పట్ల అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.సాధారణంగా సినిమా ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు చనిపోతే గత కొంతకాలంగా ప్రభుత్వం అధికారక లాంఛనాలతో వారి అంత్యక్రియలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే విశ్వనాథ్ గారికి అధికారకలాంఛనాలతో అంత్యక్రియలు జరగకపోవడంతో అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో విశ్వనాధ్ గారికి ఎంతో మంచి అనుబంధం ఉంది.అదేవిధంగా చిత్ర పరిశ్రమకు ఎన్నో సేవలు చేశారు ఆయనప్పటికీ ప్రభుత్వం అధికారక లాంచనాలతో అంత్యక్రియలు జరపకపోవడం పై ఆయనకు సరైన గౌరవం ఇవ్వలేదంటూ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈయనకు అధికారకలాంచనాలతో అంత్యక్రియలు జరగకపోవడానికి గల కారణం ఉంది.

K Viswanath: అధికారక లాంఛనాలతో అంత్యక్రియలను నిలిపివేసిన ప్రభుత్వం…

గత కొద్దిరోజుల క్రితం నిజాం మునిమనవడు అంత్యక్రియలను ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో నిర్వహించింది. నిజాం సంస్థానాన్ని పాకిస్తాన్‌లో కలపటానికి చూసిన వారి వారసులకు ఏఏ విధంగా తెలంగాణ ప్రభుత్వం అధికారక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించింది అంటూ ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు చేశాయి దీంతో గత కొంతకాలంగా అధికారిక లాంచనాలతో అంత్యక్రియలు జరపడం నిలిపివేశారని తెలుస్తోంది అందుకే విశ్వనాథ్ గారికి కూడా అధికారక లాంచనాలతో అంత్యక్రియలు నిర్వహించలేదని సమాచారం.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago