K Viswanath: లెజెండరీ డైరెక్టర్, దర్శక దిగ్గజలు కే విశ్వనాథ్ గత గురువారం అనారోగ్య సమస్యలతో మరణించిన విషయం మనకు తెలిసిందే.92 సంవత్సరాలు వయసు కలిగినటువంటి విశ్వనాథ్ గారు వయో వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ అపోలో ఆసుపత్రిలో మరణించారు. ఇక ఈయన అంత్యక్రియలను శుక్రవారం నిర్వహించారు.

తెలుగు చిత్ర పరిశ్రమకు ఎన్నో సేవలు అందించిన విశ్వనాథ్ గారు ఎన్నో అవార్డులను పురస్కారాలను అందుకున్నారు. ఇలాంటి దిగ్గజ దర్శకులు మరణించడం ఇండస్ట్రీకి తీరని లోటు అని చెప్పాలి అయితే విశ్వనాథ్ గారు మరణించడంతో ఎంతోమంది సినీ రాజకీయ ప్రముఖులు కూడా ఈయన మృతికి సంతాపం తెలియజేశారు.ఇక ఈయన అంత్యక్రియలు పంజాగుట్టలోని స్మశాన వాటికలో బ్రాహ్మణ కుటుంబ సాంప్రదాయాల ప్రకారం జరిగాయి.
ఇలా స్మశాన వాటికలో విశ్వనాథ్ గారి అంత్యక్రియలు సాధారణంగా జరగడం పట్ల అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.సాధారణంగా సినిమా ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు చనిపోతే గత కొంతకాలంగా ప్రభుత్వం అధికారక లాంఛనాలతో వారి అంత్యక్రియలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే విశ్వనాథ్ గారికి అధికారకలాంఛనాలతో అంత్యక్రియలు జరగకపోవడంతో అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో విశ్వనాధ్ గారికి ఎంతో మంచి అనుబంధం ఉంది.అదేవిధంగా చిత్ర పరిశ్రమకు ఎన్నో సేవలు చేశారు ఆయనప్పటికీ ప్రభుత్వం అధికారక లాంచనాలతో అంత్యక్రియలు జరపకపోవడం పై ఆయనకు సరైన గౌరవం ఇవ్వలేదంటూ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈయనకు అధికారకలాంచనాలతో అంత్యక్రియలు జరగకపోవడానికి గల కారణం ఉంది.

K Viswanath: అధికారక లాంఛనాలతో అంత్యక్రియలను నిలిపివేసిన ప్రభుత్వం…
గత కొద్దిరోజుల క్రితం నిజాం మునిమనవడు అంత్యక్రియలను ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో నిర్వహించింది. నిజాం సంస్థానాన్ని పాకిస్తాన్‌లో కలపటానికి చూసిన వారి వారసులకు ఏఏ విధంగా తెలంగాణ ప్రభుత్వం అధికారక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించింది అంటూ ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు చేశాయి దీంతో గత కొంతకాలంగా అధికారిక లాంచనాలతో అంత్యక్రియలు జరపడం నిలిపివేశారని తెలుస్తోంది అందుకే విశ్వనాథ్ గారికి కూడా అధికారక లాంచనాలతో అంత్యక్రియలు నిర్వహించలేదని సమాచారం.

































