Senior Heroine Bhanu Priya : వంశీ దర్శకత్వంలో వచ్చిన ‘సితార’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయింది భానుప్రియ. తరువాత కె.విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘స్వర్ణకమలం’ సినిమాతో మంచి పేరు సంపాదించుకుంది. స్వతహాగా నాట్య కళాకారిణి కావాడం మరో విశేషం. భానుప్రియ తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ భాషలలో దాదాపు 110 చిత్రాలలో నటించింది. తెలుగులో దాదాపుగా అగ్రహీరోల అందరి సరసనా నటించింది. సినిమా పరిశ్రమలో ఆమె జీవితం సాఫీగా సాగిపోయినప్పటికీ వ్యక్తిగత జీవితంలో మాత్రం చాలా ఒడిదుడుకులు ఎదుర్కొంది.

నా డాన్స్ చూసి చిరు ఏమన్నాడంటే…
అప్పట్లో మంచి డాన్సర్ గా పేరు తెచ్చుకున్న భాను ప్రియ ఎంతటి కష్టమైన స్టెప్స్ అయినా అలవోకగా అలానే ఫుల్ గ్రేస్ తో వేసే హీరోయిన్ గా గుర్తింపు ఉంది. మెగాస్టార్ చిరంజీవి తనకు డాన్స్ లో ఛాలెంజింగ్ అనిపించేది రాధ, భానుప్రియ లతో డాన్స్ ఇచ్చేసినపుడే అని పలు ఇంటర్వ్యూల్లో కూడా చెబుతారు. అంత గ్రేస్ తో డాన్స్ చేసే భానుప్రియ గారితో చిరు సాంగ్స్ లో డాన్స్ చేసినపుడు చాల ఈజీగా, చాలా బాగా చేస్తావ్ నువ్వు డాన్స్ అంటూ చెప్తారట.

ఈ విషయాన్ని హీరోయిన్ భానుప్రియ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. స్వతహాగా డాన్సర్ అవడం అలానే డాన్స్ మీద ఆసక్తి ఎక్కువగా ఉండటం వల్ల డాన్స్ బాగా చేస్తానంటూ చెప్పారు. ఆమె డాన్స్ తో పాటు అభినయానికి ఎన్నో అవార్డులు అలాగే అభిమానులు ఉన్నారు. ప్రస్తుతం ప్రాముఖ్యత ఉన్న పాత్రల్లోనే నటించాలని భావిస్తున్న భానుప్రియ గారు వెండి తెరకు దూరంగా ఉన్నారు.
































