Actor Kantharao Daughter Susila : జానపద సినిమాలో కత్తి యుద్ధాలు చేసే హీరో అనగానే గుర్తొచ్చే హీరో కాంతారావు. ఆయన పూర్తి పేరు తాడేపల్లి లక్ష్మీకాంతరావు. అయన నాటకాలల్లో ప్రసిద్ధి చెంది ఆ తరువాత సినిమాల వైపు వచ్చారు. అనేక జానపద, సాంఘిక చిత్రలాల్లో నటించిన ఆయన దాదాపు 100 సినిమాలలో హీరోగా నటించారు. ఇక మిగిలిన సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను అలాగే విలన్ గాను నటించారు. ముఖ్యంగా నారద పాత్రలో బాగా ఫేమస్ కాంతారావు గారు. ఎన్టీఆర్ తో సమానంగా పౌరాణిక జానపదాలలో నటించిన ఆయన అప్పటి సమకాలిన నటులైన ఎన్టీఆర్ ఏఎన్ఆర్ తో సమానమైన క్రేజ్ ను సంపాదించుకున్నారు.
మోహన్ బాబు కాళ్ళు పట్టుకున్నారు…
ఇక ఆయన మరణించి చాలా ఏళ్లు గడచినా ఆయన కూతురు సుశీల ఇంకా ఆయన ఉనికిని ఇండస్ట్రీ కాపాడాలంటూ పోరాడుతున్నారు. ఆయనకు ఫిల్మ్ ఇండస్ట్రీ కనీసం ఇల్లు కూడా ఇవ్వలేదంటూ ఆయన కోరిక తీరకుండానే పోయారంటూ చెప్పారు. ఇక ఆవిడ తన తండ్రి గురించి మాట్లాడుతూ రజనీకాంత్ వంటి వారు ఆయనకు అభిమానులు అంటూ కాళ్ళకు నమస్కారం చేసేవారని గుర్తుచేసుకున్నారు.
ఇక బాలకృష్ణ గారి సినిమా పాండురంగడు లో మోహనబాబు గారు ఒక వేషం వేసారు, అందులో ఆయన ఒకరి కాళ్ళను పట్టుకునే సీన్ ఉంది. అయితే ఆయన ఎవరి కాళ్ళు పట్టుకోనని చెప్పి కాంతారావు గారు అయితే చేస్తాను ఆయన కాళ్ళు పట్టుకుంటాను అని చెప్పారట. అలా ఎవరి కాళ్లు పట్టుకోని మోహన్ బాబు మా నాన్న గారి కాళ్ళు పట్టుకున్నారు అంటూ సుశీల చెప్పారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…