Categories: devotionalFeatured

Thirumala History : 1700 ఏళ్ళ నాటి తిరుమల చరిత్ర… ఆ కలియుగ ప్రత్యేక్ష దైవం వెంకటేశ్వరుని చరిత్ర ఏంటో తెలుసా..??

Thirumala History : కలియుగంలో భక్తుల కోరికలను తీర్చి వారి పాపాలను తొలగించడానికి సాక్ష్యాత్తు ఆ మహా విష్ణువే వెంకటేశ్వరుని రూపంలో శిలలా వెలసాడు. భూదేవి శ్రీదేవి సమేత ఆ వెంకటేశ్వర స్వామిని ఏటా కొన్ని లక్షల మంది దర్శించుకుంటారు. ఇక కొత్త సంవత్సరాది రోజున అయితే దాదాపు ఆ ఒక్క రోజే డెబ్భై ఐదు వేల మందికి పైగా దర్శించుకుంటారు. 1700 వందల ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన తిరుమల ఆలయం గురించిన ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం

ఆలయ ప్రశస్తి… వెంకటేశ్వరుడు ఎలా భూమి పైకి వచ్చాడు…

త్రిమూర్తులలో ఎవరు గొప్పవాడో తేల్చుకోమని మహా మునులకు నారదుడు మెలిక పెట్టడంతో అందరు మునులు కలిసి భృగు మహర్షిని దేవలోకం పంపగా అక్కడ ఆయన బ్రహ్మ వద్దకు వెళ్లగా ఆయన పట్టించుకోక పోవడంతో శివుని వద్దకు వెళ్తాడు. కైలాసంలో శివుడు పార్వతి దేవితో కలిసి రుద్రయాగం చేస్తూ మహర్షిని గమనించరు. దీంతో నిరాకారలింగాకారంలో పూజలందుకుంటావని శపించిన పిమ్మట వైకుంఠం వెళ్లగా అక్కడ మహావిష్ణువు లక్ష్మి వడిలో పడుకుని ఉండగా ఆయన పాదాలు భృగు మహర్షి వైపుకు ఉండటం ఆయనను పట్టించుకోకపోవడంతో ఆయన మహా విష్ణువును తన కాలిని ఛాతిపై పెట్టి నిద్రాలేపుతాడు. మహావిష్ణువు ఆ మహాముని కోపాన్ని చల్లార్చడానికి ఆయన కాళ్లకు పూజించి శాంతింప జేయగా అదే సమయంలో యదలో కొలువుండేది లక్ష్మి దేవి కనుక ఆమె అలిగి భూమి మీదకు మరు వేషంలో వెళ్ళిపోతుంది. ఇక ఆమెను వెతుక్కుంటూ శ్రీనివాసుడు అనే మానవ రూపం ధరించి మహా విష్ణువు భూలోకం లోకి వస్తారు.

ఆయన లక్ష్మి దేవిని వెతుకుతూ ధ్యానం చేస్తుండగా ఆయన ఆకలిదప్పులను తీర్చమని లక్ష్మి దేవి శివున్ని బ్రహ్మ ను కోరగా ఆవు దూడ రూపంలో వెళ్లి పుట్ట వద్ద రోజూ పాలు ఇచ్చి శ్రీనివాసుని ఆకలి తీరస్తుంటారు. ఒకరోజు ఆదిగమనించిన గోవుల కాపరి అవును కొట్టబోగా శ్రీనినివాసుడు అడ్డు తగలడంతో తల పై గాయం అవుతుంది. అదే వెంకటేశ్వరుని నామాలు అని విశ్వాసం. ఇక కాపరి మీద కోపంతో ఇప్పటికిప్పుడు మరణిస్తావని శపించగా అతను మరణిస్తాడు. విషయం తెలిసీ చోళ రాజు అక్కడికి చేరి శ్రీనివాసుడితో గొడవ పడగా వచ్చే జన్మలో రాక్షసుడిగా పుడతావని శపిస్తాడు. ఇంతలో తన తప్పు తెలుసుకున్న రాజు శరణు వేడగా వచ్చే జన్మలో ఆకాశ రాజుగా పుడతావని నీ కూతురుని నేను పెళ్లి చేసుకుంటానని వరమిచ్చాడు.

ఇక శ్రీనివాసుడి తలకు తగిలిన గాయం వల్ల అక్కడ జుట్టు లేకపోవడంతో నీలా అనే రాకుమారి అది చూసి అక్కడ జుట్టును పెట్టి సరి చేస్తుంది. దీనికి శ్రీనివాసుడు ఆమెను దేవతగా మర్చి నా భక్తులు నీకు తలనీలాలు సమర్పించి ఋణం తీర్చుకుంటారని చెబుతాడు. ఇక మరు జన్మలో ఆకాశ రాజుగా పుట్టిన చోళ రాజు సంతానం కోసం పూజలు చేయగా బంగారు కమలంలో పాప దొరుకుతుంది. ఆమె పేరే పద్మావతి. ఇక ఆమెను ఒకసారి శ్రీనివాసుడు చూసి ఇద్దరూ ప్రేమలో పడతారు. ఇక వారి పెళ్ళికి రాజు ఒప్పుకున్నా ఆయనకు సరితూగాలని కుభేరుడితో అప్పుగా ధణం శ్రీనివాసుడు తెచ్చుకుని నా భక్తులు నీకు చెల్లిస్తారని మాట ఇస్తాడు.

ఇక వారి పెళ్లి జరిగి సంతోషంగా ఉన్న సమయంలో నారదుడి ద్వారా విషయం తెలుసుకున్న లక్ష్మి దేవి తిరుమల కొండపై నివసిస్తున్న పద్మావతి, శ్రీనివాసుల దగ్గరికి వెళుతుంది. అక్కడ గొడవ పడటంతో శ్రీనివాసుడు శిలా రూపం దరిస్తాడు. ఇక ఇరువురు భార్యలు శిలారూపంలో ఆయనకు ఇరువైపులా ఉండి పూజింప బడుతారు. ఇక వీరిని శ్రీవారి ప్రస్తుతం అనే స్థలంలో ఆకాశ రాజు తమ్ముడైన తొండమాన్ రాజు ప్రతిష్టించి పూజలు చేశారు. అలా కలియుగంలో పాపాలను తొలగించడానికి శ్రీ మహా విష్ణువు ఆయన సతీమనులతో తిరుమలలో కోలువయ్యారు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

7 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago