Sri Ramayanam : మన దేశంలో హిందూ మత విశ్వాసకులు అత్యంత పవిత్రంగా భావించే గ్రంధాలు రామాయణం, మహాభారతం. ఈ రెండు ఇతిహాసాల్లోని అనేక విషయాలు నేటికీ మనం ఆచారిస్తున్నాం. ఏదోక సందర్బంలో మనకు మార్గనిర్దేశనం చేస్తాయి. ఇప్పటి వరకు మనం వింటున్న అనేక నీతి కథలలో ఎక్కడో ఒకచోట రామయాణం, మహాభారతం స్ఫూర్తి ఉంటుంది. ఇక రామయణం అనగానే రాముడు మనకు చూపించిన మార్గం. రాముడు నడిచిన ధర్మం అనే మార్గంలో మనం ఉండాలని రామాయణం మనకు సూచిస్తుంది. రామాయణంలో మనం తెలుసుకునే అంశాలు రాముడి జననం, సీతా రామ కళ్యాణం, రామపట్టాభిషేకం, రావణ సంహారం ఇవన్నీ రామాయణంలో మనకు తెలుసు. అయితే రాముడు ఆ తరువాత అయోధ్య ను కొన్ని వేల సంవత్సరాలు పరిపాలించాడు. ఇక రాముడు విష్షు అంశతో పుట్టినవాడైనా మానవ జన్మ ఎత్తాడు కాబట్టి ఆయనకు మరణం లేదా నిర్యానం ఉండాలి. మరి వాటి గురించి మనలో చాలా మందికి తెలియని విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
సీత, రాముడు, లక్ష్మణుల నిర్యానం…
రాముడు వనవాసం వెళ్లడం, అక్కడ సీత ను రావనాసురుడు అపహరించడం, ఆ తరువాత రావణ సంహారం మళ్ళీ అయోధ్యకు రావడం, శ్రీరామ పట్టాభిషేకం ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. ఇక శ్రీరాముడు అయోధ్య పరిపాలన కొన్ని వేల సంవత్సరాలు చేశారు. అయితే ఎంత మంచి పాలన చేసినా లోకులు కాకులు అన్న చందంగా సీతా దేవి గురించి తప్పుగా మాట్లాడటం, అది రాముడి వరకు చేరడంతో ఆమెను వాల్మీకి మహర్షి ఆశ్రమంలో వదిలి రమ్మని తమ్ముడు లక్ష్మణుడిని అజ్ఞాపిస్తాడు. ఇక అలా సీతా దేవి ఎడబాటుతో రాముడు అయోధ్య పాలన సాగించగా సీతా దేవి కవల పిల్లలైన ‘లవ కుశ’ లకు జన్మనిస్తుంది. ఇక రాముడు ఒకసారి అశ్వమేధ యాగం చేయాలని భావించి తన రాజ్యంలోని మునీశ్వరులకు ఇతర రాజులకు అందరికీ ఆహ్వానం పంపగా అలా వాల్మీకి మహర్షి తన శిష్యులతో పాటు అయోధ్య చేరుకోగా, వాల్మీకి శిష్యులయిన లవకుశలు అక్కడికి వెళ్తారు.
అక్కడ రామాయణం గానం చేయగా రాముడు కంట పడి వాళ్ళు తన కుమారులు అన్న విషయం గ్రహించిన రాముడు వాల్మీకి మహర్షి తో సీతా దేవి పవిత్రత మీద నాకు నమ్మకం ఉంది కానీ తన పవిత్రతను అందరి ముందు నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పగా సీతా దేవిని అయోధ్యకు పిలిపిస్తారు వాల్మీకి. ఇక అక్కడ ఆమె మరోసారి ఆమె పవిత్రతను నిరూపించుకోడానికి తన తల్లి భూదేవి లో కలిసిపోతుంది. అలా సీతా దేవి నిర్యానం చెందగా ఊహించని ఆ పనికి రాముడు దిక్కులు పిక్కటిల్లేలా అరుస్తూ ఏడుస్తాడు. దుఃఖాన్ని అనచుకుని అయోధ్య పాలన సాగిస్తున్న రాముడికి ఓకనాడు ఒక మునీశ్వరుడు వచ్చి తనతో ఏకాంతంగా మాట్లాడాలని మాట్లాడుతున్న సమయంలో ఎవరైనా వస్తే వారి శిరస్సును వధించాల్సిందిగా మాట తీసుకుంటాడు. ఇక ఆ ముని ఎవరో కాదు యమధర్మ రాజు. ఆయన మీరు నిర్యానం చెందవలసిన సమయం వచ్చింది అంటూ రాముడికి చెప్పగా బయట ఎవరూ రాకుండా కాపలాగా ఉన్న లక్ష్మణుడి చెంతకు ధుర్వాస మహర్షి వచ్చి రాముడి కలవాలని అడుగగా కాసేపు ఆగమని చెబుతాడు. కానీ ధుర్వాస మహర్షి కి కోపం వచ్చి అయోధ్య అగ్నికి అహుతి అయ్యేలా శపిస్థానని చెప్పడంతో విధిలేక అన్న వద్దకు వెళ్తాడు.
అది చూసి యమధర్మ రాజు అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక ఇచ్చిన మాట కోసం రాముడు లక్ష్మణుడిని వధించలేక అన్నీ త్యజించి రాజ్యం నుండి వెళ్లిపోవాలని అది మరణ శిక్షకు సమానం కావున అలా అజ్ఞాపిస్తాడు. అన్న నా వల్ల మాట తప్పాడన్న బాధతో లక్ష్మణుడు సరయు నదిలో దూకి నిర్యానం చెందారు. ఇక తమ్ముడి మరణం తరువాత శ్రీ రాముడు తమ్ముడు భరతుడికి పాలన అప్పగించి తాను ఈ లోకం విడిచి వెళ్లిపోవాలని అనుకుంటున్నట్లు చెప్తాడు. అయితే భరతుడు రాజ్యాన్ని రెండు భాగాలుగా చేసి లవ కుశ లకు అప్పగించి తాను అన్న వెంట వెళ్లాలని నిర్ణయం తీసుకోగా శత్రుఘ్నుడు కూడా అదే నిర్ణయం తీసుకోగా వేద మంత్రోచ్చారణల మధ్య శ్రీ రాముడు వానరులు, తమ్ముళ్ల తో కలిసి సరయు నదిలో నిర్యానం చెంది విష్ణు రూపంలో దర్శనమిచ్చి పునీతులను చేసారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…