Featured

Actor Koushik : ఆ జైల్లో స్నానం చేసే బకెట్ లో అన్నం తెచ్చి పెడతారు…: నటుడు కౌశిక్

Actor Koushik : బుల్లితెర నుండి వెండి తెర వరకూ నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుని పక్కింటి అబ్బాయి ఇమేజ్ తో నటుడుగా కొనసాగుతున్న కృష్ణ కౌశిక్ నటుడిగా మంచి పేరుంది. కానీ అవకాశాలు మాత్రం సరిగా రాకపోవడం వల్ల ఈ మధ్య సినిమాల్లో కనిపించడం లేదు. కృష్ణ కౌశిక్ తండ్రి నటుడే, అలాగే తమ్ముడు బాలాదిత్య కూడా బాల నటుడుగా ఎన్నో సినిమాలను చేసి ఆపై హీరోగా తెలుగు సినిమల్లోకి ఎంట్రీ ఇచ్చి పెద్దగా సక్సెస్ అవ్వలేకపోయాడు. ఇప్పుడంటే కౌశిక్ సినిమాలలో సీరియల్స్ లో కనిపించడం లేదు కానీ ఒకప్పుడు కౌశిక్ సీరియల్స్ తో బాగా బిజీ, దాదాపు 36 సీరియల్స్ లో నటించగా అందులో 12 సీరియల్స్ కేవలం ఈటీవీ లోనే వచ్చాయి. ఇక 18 సీరియల్స్ లో హీరోగా నటించిన కౌశిక్ సినిమాలో హీరోగా చేసినా ఆ సినిమా రిలీజ్ కాలేదు.

జైలు జీవితం మర్చిపోలేను…

టీవీ ఆర్టిస్టుల సమస్యల పరిష్కారం కోసం ధర్నా చేసి అరెస్టు అయిన కౌశిక్ చంచల్ గూడా జైలుకి వెళ్లాల్సి వచ్చింది. అక్కడ జనరల్ భారక్ లో గడిపిన రోజులను మర్చిపోలేను అంటూ ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. విఐపి వాళ్లకు సెపరేట్ గది టీవీ అలానే బాత్ రూమ్ ఉంటాయని, జనరల్ లో అలా ఉండదంటూ ఒకే హాల్ లో దాదాపు 80 మంది దాకా ఉంటారని చెప్పారు. అందరికీ కామన్ బాత్రూమ్స్ ఉంటాయంటూ వాటికీ తలుపులు కూడా ఉండవని, కేవలం కర్టన్స్ అడ్డుగా ఉంటాయంటూ చెప్పారు. ఇక ఫుడ్డు మాత్రం బాగా పెడతారని అయితే అప్పటివరకు గిన్నెల్లో అన్నం తీసుకురావడం చూసాను కాకపోతే అక్కడ స్నానము చేసే బకెట్స్ లాంటి వాటిలో తెస్తారు.

అంతమందికి పెట్టాలన్నపుడు అలానే బకెట్ లో తేవాల్సిందే. అయితే ఫుడ్డు బాగుంటుంది. ఇక కాంటీన్ లో బిస్కెట్స్, చాక్లేట్స్ ఇలా అన్ని దొరుకుతాయి. అప్పు పెట్టి మనం విడుదల అయినపుడు మన తరుపు వాళ్ళు వచ్చినపుడు ఆ ఖాతా క్లియర్ చేయాలి అంటూ చెప్పారు. అయితే జైలులో అనేక రకాల జనాలను చూసానని, వెళ్ళగానే నాకంటూ ఒక గ్లాస్ అలానే ఒక ప్లేట్ ఇవ్వగా పక్కన పెట్టి మళ్ళీ తిరిగి చూసేలోపు లేవని వెంటనే అక్కడున్న పోలీస్ అధికారి దొంగలు ఉంటారు చూసుకోవాలి జాగ్రత అని చెప్పగానే జైలులో దొంగలా అని ఆశ్చర్య పోయాను. కానీ నేను నటుడు అవడం వల్ల చాలా మంది గుర్తు పట్టి మాట్లాడేవారు, అది బాగా అనిపించింది అంటూ చెప్పారు.

Bhargavi

Recent Posts

కూరలో ఉప్పు ఎక్కువైందా? ఇక టెన్షన్ అవసరం లేదు.. ఈ సింపుల్ చిట్కాలతో రుచి మళ్లీ సెట్!

వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…

23 hours ago

కంప్యూటర్ ముందు గంటల తరబడి కూర్చుంటున్నారా? వెన్నెముకకు ముప్పు తెస్తున్న కొత్త జీవనశైలి ఇదే!

ఒకప్పుడు వెన్నునొప్పి, మెడ నొప్పి, వెన్నెముక సమస్యలు అంటే 50 ఏళ్లు దాటిన వారిలోనే ఎక్కువగా కనిపించేవి. వయసు పెరగడం,…

23 hours ago

మధుమేహం, గుండె జబ్బులు లేకుండా పిల్లలు పుడతారా? శాస్త్రవేత్తల కొత్త ప్రయోగం ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది!

వైద్య శాస్త్రం రోజురోజుకూ కొత్త మైలురాళ్లు చేరుకుంటోంది. ఒకప్పుడు నయం చేయలేని వ్యాధులకు మందులు కనుగొన్న శాస్త్రవేత్తలు ఇప్పుడు వ్యాధులు…

1 day ago

కరివేపాకుతో బరువు తగ్గొచ్చా? రోజూ ఇలా తీసుకుంటే ఆరోగ్యానికి ఎన్నో లాభాలు!

ఈ రోజుల్లో చిన్నవాళ్ల నుంచి పెద్దవాళ్ల వరకు చాలా మందిని వేధిస్తున్న సమస్యల్లో అధిక బరువు ఒకటి. పని ఒత్తిడి,…

1 day ago

83 ఏళ్ల వయసులోనూ అదే కసి.. ఒక సీన్ కోసం నిద్ర మానేసిన అమితాబ్ బచ్చన్!

సినిమా అంటే అంకితభావం. పాత్ర అంటే బాధ్యత. ప్రేక్షకుల ముందు కనిపించే ప్రతి సన్నివేశం పరిపూర్ణంగా ఉండాలనే తపన. ఇవన్నీ…

1 day ago

పీరియడ్స్ సమయంలో యోగా చేయొచ్చా? అపోహలు పక్కన పెట్టండి.. నిపుణులు చెబుతున్న నిజాలు ఇవే!

నేటి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన కొద్దీ యోగా చేసే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. శారీరక ఆరోగ్యంతో పాటు…

1 day ago