Hero Sumanth : అక్కినేని నట వారసుడిగా ఆయన పోలికలతో ఇండస్ట్రీకి పరిచయమైన సుమంత్ హీరోగా ఎంట్రీ ఇచ్చి గుర్తింపు తెచ్చుకున్నా మంచి హిట్లనైతే సంపాదించుకోలేదు. అక్కినేని గ్లామర్, నటన రెండూ ఉన్నా కథల ఎంపికలో తడబడి సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేదు. ఈ మధ్య కాలంలో అడపా దడపా క్యారెక్టర్ రోల్స్ అలానే హీరోగా కథ నచ్చినట్టు సినిమాలను చేస్తూ అలరిస్తున్న సుమంత్ తనకు ఎన్టీఆర్ కథనాయకుడు, మహానాయకుడు లో నటించినపుడు బాలకృష్ణ తో ఉన్న రిలేషన్, అలానే నందమూరి అక్కినేని గొడవలమీద స్పందించారు.
నందమూరి, అక్కినేని ల మధ్య గొడవలు…
బాలకృష్ణ గారితో పనిచేయడం గురించి మాట్లాడుతూ ఆయన సినిమా విషయంలో ఎన్సైక్లోపీడియా అంటూ చెప్పారు. ఎన్టీఆర్ గారివి నాగేశ్వరావు గారి పాత సినిమా డైలాగులన్నీ బాగా చెప్తారని ఆయనకు బాగా గుర్తుంటాయి అంటూ చెప్పారు. ఇక నందమూరి, అక్కినేని కుటుంబాల మధ్య కోల్డ్ వారు ఉందని బయటకు వినిపిస్తుంటాయి అది నిజమేనా అనే ప్రశ్న ఎదురావగా అలాంటిదేమీ లేదని క్లారిటీ ఇచ్చారు.
పైకి వచ్చే పుకార్లే తప్ప నిజానికి అలాంటిదేమీ లేదు అంటూ చెప్పారు సుమంత్. ‘మనం’ సినిమా అపుడు నందమూరి ఫ్యామిలీ వల్లే నంది అవార్డు రాలేదనే టాక్ మీద కూడా స్పందించిన సుమంత్ అలాంటిదేమీ లేదంటూ నందమూరి కుటుంబంతో మంచి అనుబంధం ఉందంటూ చెప్పారు. ఇటీవలే అక్కినేని తొక్కినేని అంటూ బాలకృష్ణ చేసిన వాఖ్యలు, మళ్ళీ మా బాబాయ్ ను నేనంటానా అంటూ చెప్పడంతో ఈ పాత ఇంటర్వ్యూ మళ్ళీ వైరల్ అవుతోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…