Actor Madhunandan: సాధారణంగా సినిమాలపై ఉన్న ఆసక్తితో ఎంత గొప్ప స్థాయిలో ఉన్న కూడా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇస్తారు అనే సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే సినిమాలపై ఉన్న ఆసక్తితో ఏకంగా గూగుల్ లో జాబ్ వదిలేసి మరీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారని నటుడు మధునందన్ తెలిపారు.తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
తన తల్లిదండ్రులు బాగా చదువుకొని మంచి జాబ్ చేయాలని ఆశపడ్డారు. అయితే తాను కూడా అలాగే మంచి జాబ్ చేశానని అయితే సినిమాలపై ఉన్న ఆసక్తితో జాబ్ వదులుకున్నానని ఆయన తెలిపారు. ఇక పోతే తన భార్య కూడా ఎంబీఏ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారని ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఏదైనా సమస్య వస్తే తన భార్య జాబ్ చేయడానికి సిద్ధంగా ఉందని తెలిపారు.
ఒకేసారి రెండు పడవలపై ప్రయాణం చేయడం మంచిది కాదని అందుకే తాను ఉద్యోగం మానేసి ఇండస్ట్రీ వైపు వచ్చానని ఆయన తెలిపారు. ఇక తనతోపాటు లిరిక్ రైటర్ కృష్ణచైతన్య ఇద్దరం మంచి స్నేహితులం అని మేము ఏడాదిపాటు కృష్ణానగర్లో ఒకే ఇంట్లో అద్దెకు ఉండే వాళ్ళమని తెలిపారు. ఇకపోతే కొన్నిసార్లు వాళ్ళు అనుకున్న పాత్రలో మనం సెట్ కాకపోతే ఆటోమెటిగ్గా సినిమాలలో మనల్ని తీసుకోరనే విషయాన్ని ఆయన ప్రస్తావించారు.
ఇకపోతే తనకు ఎన్టీఆర్ నటించిన స్టూడెంట్ నెంబర్ వన్ అదేవిధంగా, తేజ గారి నువ్వు నేను రెండు ఒకేసారి తనకు ఆఫర్స్ వచ్చాయని తెలిపారు. ఈరోజు ఉదయం ఎన్టీఆర్ స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా షూటింగ్లో పాల్గొన్నాను సాయంత్రం తేజ గారు నుంచి ఫోన్ వచ్చింది. ఏం చేయాలో దిక్కు తెలియలేదు తేజ గారు కాదంటే పిచ్చి కుక్కను కొట్టినట్టు కొడతారనే భయం ఉండేది. అందుకే రాజమౌళి గారికి చెప్పకుండా ఆయనకు భయపడి ఎన్టీఆర్ సినిమా స్టూడెంట్ నెంబర్ వన్ సెట్ లో నుంచి పారిపోయానని ఈ సందర్భంగా మధునందన్ తనకు ఎదురైన సంఘటన గురించి చెప్పుకొచ్చారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…