Actor Nani: టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈయన నటించిన దసరా సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా అన్ని భాషలలోనూ మంచి కలెక్షన్లను రాబడుతుంది.
ప్రస్తుతం నాని దసరా సెలబ్రేషన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా మంచి సక్సెస్ అవడంతో నానికి ఊహించని విధంగా నటి శృతిహాసన్ ప్రియుడు శంతను హజారికా అదిరిపోయే గిఫ్ట్ పంపిస్తూ తనకి సర్ప్రైజ్ చేశారు. శంతను డూడల్ ఆర్టిస్ట్ అనే విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈయన తనదైన శైలిలో కళాఖండాలు రూపొందిస్తుంటారు.
ఇకపోతే తాజాగా దసరా చిత్రంలోని నాని ఐకానిక్ స్టిల్ డూడుల్ ఆర్ట్ లో రూపొందించారు. దసరా చిత్ర డూడుల్ ఆర్ట్ పోస్టర్ అదిరిపోగా నెటిజెన్స్ వైరల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఇక ఈ సర్ప్రైజ్ డూడుల్ ఆర్ట్ రూపొందిస్తూ శంతను నాని పై ఉన్నటువంటి తన అభిమానాన్ని తెలియజేశారు. ఇక ఈ విషయంపై నాని స్పందిస్తూ తనకు కృతజ్ఞతలు తెలిపారు.
ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇకపోతే ఈ సినిమాలో నానితో పాటు కీర్తి సురేష్ నటించిన విషయం మనకు తెలిసిందే. వీరిద్దరూ ఈ సినిమాలో డీ గ్లామర్ పాత్రలలో నటించారు. ఇక ఈ సినిమాకు అన్ని భాషలలో అనుహ్యమైన స్పందన రావడంతో చిత్ర బృందం సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ ఎంజాయ్ చేస్తున్నారు.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…