Featured

Actor Rajeev Kanakala : చెల్లికి క్యాన్సర్ 4వ స్టేజి అని తెలిసాక… ఎంత నరకం అనుభవించామంటే…: నటుడు రాజీవ్ కనకాల

Actor Rajeev Kanakala : దేవదాస్ కనకాల గారి అబ్బాయిగా ఇండస్ట్రీకి పరిచయమైన రాజీవ్ కనకాల మొదట సీరియల్స్ చేస్తూ ఆ తరువాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. సినిమాల్లో హీరోగాను, విలన్ గాను, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను ఇలా చేసిన ప్రతి పాత్రకి న్యాయం చేసారు. ఇక తన భార్య సుమ కనకాల కూడా ఇటు బుల్లితెర మీద బిజీ యాంకర్ గా ఉంటూ అటు సినిమాల్లోనూ ఇంకా యూట్యూబ్ లో కూడా సొంత ఛానెల్ తో దుమ్ములేపుతోంది. ఇక రాజీవ్ కనకాల ఈ మధ్య సినిమాలను చాలా వరకు తగ్గించారు. ఎన్టీఆర్, రాజీవ్ కాంబినేషన్ ఒకప్పుడు బాగా హిట్ కానీ యమదొంగ తరువాత చాలా గ్యాప్ వచ్చింది. ఇక ఆయన కుటుంబంలో తల్లి తండ్రి అలాగే చెల్లి వరుసగా మరణించడంతో చాలా బాధలు పడ్డారు రాజీవ్, రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో వాటన్నిటి మీద రాజీవ్ మాట్లాడారు.

చెల్లికి 4వ స్టేజి క్యాన్సర్ అన్నపుడు నరకం చూసాం…

రాజీవ్ కనకాల గారి కుటుంబంలో తల్లి దండ్రులు ఇద్దరూ నాటక రంగం నుండి వచ్చారు. ఇక చెల్లి కూడా నటి కావడంతో వాళ్ళందరూ ప్రేక్షకులకు సుపరిచితులే. అయితే రాజీవ్ గారి కుటుంబంలో 2018 నుండి వరుస విషాదలు చోటు చేసుకున్నాయి. మొదట తల్లి గుండె పోటుతో మరణించారు. ఆ తరువాత ఏడాదికి తండ్రి దేవదాస్ కనకాల గారు సర్జరీ జరిగి ఇన్ఫెక్షన్ అవడంతో మరణించారు. ఈ రెండు మరణాలను తట్టుకునేలోపే చెల్లికి క్యాన్సర్ 4వ స్టేజి అని తెలిసింది. తనకు క్యాన్సర్ అని తెలిసినప్పటికే 4వ స్టేజి అని తెలిసింది. మొదట్లో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ లో చికిత్స చేయించాము. ఆ తరువాత వరంగల్ లో ఎవరో బాగా చూస్తారంటే అక్కడికి వెళ్లి మందులు తెచ్చాము.

మళ్ళీ టెస్టులు చేయిస్తే 85% క్యాన్సర్ తగ్గిందని రిపోర్ట్స్ లో వచ్చింది. అందరం హ్యాపీగా ఉన్న సమయంలో లాక్ డౌన్ టైములో మరోసారి తాను ఇబ్బందులు పడింది. మళ్ళీ హాస్పిటల్స్ తిరిగాం. అయితే ఏప్రిల్ సమయానికి తాను ఎక్కువ కాలం బ్రతకదు అని చెప్పేసారు. ఇక అందరం ఇంట్లో తనతోనే ఉండే వాళ్ళం. మా బావ గారు మరీ ఇబ్బంది పడ్డారు, సీరియస్ అయితేనే నాకు కాల్ చేసి రమ్మంటారు. ఆయన తాను ఇంకా కొన్నిరోజులు మాత్రమే ఉంటుందని చెప్పినపుడు అందరం ఒకచోట ఉండి తనని చూసుకున్నాం. అపుడు చాలా నరకం అనుభవించాం అంటూ ఎమోషనల్ అయిన రాజీవ్ కనకాల.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago