Movie News

Actor Suriya: ఆస్కార్ ఓటు హక్కు వినియోగించుకున్న నటుడు సూర్య.. ఫోటో వైరల్!

Actor Suriya: సాధారణంగా చిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి సెలబ్రిటీలకు వివిధ రకాల పురస్కారాలతో వారిని సత్కరించడం సర్వసాధారణం అయితే చిత్ర పరిశ్రమలో అన్నిటికన్నా ఎంతో కీలకంగా అందించే అవార్డులలో ఆస్కార్ అవార్డు ఒకటి. ప్రతి ఏడాది ఈ ఆస్కార్ అవార్డు వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహిస్తారు.

ఇలా ప్రతి ఏడాది జరిగే ఆస్కార్ వేడుకలలో భారతీయ చిత్రాలు పోటీ పడకపోవడంతో పెద్దగా వీటిని ఎవరు పట్టించుకునే వారు కాదు. ఇక ఈ ఏడాది లాస్ ఏంజెల్స్ లో జరగబోయే 95వ ఆస్కార వేడుకలలో భాగంగా మన తెలుగు సినిమా ఆస్కార్ నామినేషన్స్ లో ఉండడంతో ప్రతి ఒక్కరి చూపు ఈ ఆస్కార్ అవార్డు వేడుకలపై పడింది. ఈ ఆస్కార్ వేడుకలను చూడటం కోసం పరిచోట్ల బిగ్ స్క్రీన్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు.

ఇక ఆస్కార్ అవార్డులను ఎంపిక చేయడం కోసం పలువురు సెలబ్రిటీలకు ఆస్కార్ ఓటును కూడా కల్పించిన విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే కోలీవుడ్ నటుడు సూర్య సైతం ఈ ఓటు హక్కును కలిగి ఉన్నారు.ఇలా ఓటు హక్కు కలిగినటువంటి సెలబ్రెటీలు ఆన్లైన్ ద్వారా ఈనెల రెండవ తేదీ నుంచి ఏడవ తేదీ వరకు ఓటు హక్కు వినియోగించుకొని అవకాశాన్ని కల్పించారు.

Actor Suriya: తెలుగు సినిమాకి ప్రాధాన్యత ఇచ్చి ఉంటారు…

ఈ క్రమంలోనే నటుడు సూర్య తన ఓటు హక్కును వినియోగించుకున్నట్లు సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. ఈ విధంగా సూర్య ఓటు హక్కును ఉపయోగించుకున్నట్లు స్క్రీన్ షాట్ కూడా సోషల్ మీడియలో షేర్ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటో వైరల్ గా మారింది. ఇక సూర్య తప్పకుండా మన తెలుగు సినిమాకి తన ఓటు వేసి ఉంటారని ప్రతి ఒక్కరు భావిస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago