Movie News

Kiran Abbavaram: ఆ యంగ్ హీరోయిన్ తో కిరణ్ అబ్బవరం ప్రేమలో పడ్డారా… వైరల్ అవుతున్న ఫోటోలు!

Kiran Abbavaram: రాజావారు రాణివారు సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు నటుడు కిరణ్ అబ్బవరం. సినిమాలపై ఆసక్తి ఉండడంతో వృత్తిపరంగా ఇంజనీర్ అయినటువంటి ఈయన తన ఉద్యోగాన్ని వదిలేసుకుని షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ హీరోగా సినిమా అవకాశాలను అందుకున్నారు. ఇలా ఇండస్ట్రీలో హిట్ ఫ్లాపాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలలో నటిస్తున్నారు.

ఇలా వరుస సినిమాలలో నటిస్తున్నటువంటి ఈయన తరచూ ఏదో ఒక విషయం ద్వారా వార్తల్లో నిలుస్తుంటారు. అయితే తాజాగా కిరణ్ అబ్బవరం తన వ్యక్తిగత కారణాల ద్వారా వార్తల్లో నిలిచారు. ఈయన మొదటి సినిమా రాజావారు రాణివారు సినిమాలో నటి
రహస్య గోరఖ్ తోకలిసి నటించారు. అయితే ఈయన ఈమెతో ప్రేమలో పడ్డారని పెద్ద ఎత్తున వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇలా వీరిద్దరూ కలిసి మొదటి సినిమాలో నటించినప్పటికీ ఈయన వరుస సినిమాలలో నటిస్తూ ఉండగా రహస్య మాత్రం ఇతర సినిమాలలో నటించలేదు అయితే వీరిద్దరి మధ్య ఉన్నటువంటి ఆ బాండ్ మాత్రం అలాగే కంటిన్యూ అవుతుందని తెలుస్తోంది.తాజాగా వీరిద్దరూ సోషల్ మీడియా వేదికగా ఒకే లొకేషన్ లో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేయడంతో ఇవి కాస్త వైరల్ గా మారాయి.

Kiran Abbavaram: నటి రహస్యతో ప్రేమలో ఉన్నారా…

కిరణ్ అబ్బవరం తన స్నేహితులతో కలిసి తాజాగా కాశ్మీర్ ట్రిప్ వెళ్ళినట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగా రహస్య కూడా పాల్గొన్నారు. అయితే వీరిద్దరూ కూడా వేరువేరుగా ఒకే ప్లేస్ లో ఉన్నటువంటి ఫోటోలను షేర్ చేయడంతో ఈ అనుమానాలకు కారణం అవుతుంది. ఈ ఫోటోలు చూసిన నెటిజన్స్ కొంపదీసి కిరణ్ అబ్బవరం నటి రహస్య ప్రేమలో పడ్డారా అందుకే ఇద్దరూ ఒకే ఫోటోలను షేర్ చేశారా అంటూ నెటిజన్స్ కామెంట్లో చేస్తున్నారు. దీంతో మరోసారి ఈయన వార్తల్లో నిలిచారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago