Movie News

Jr NTR: యావత్ భారతదేశాన్ని గుండెల్లో పెట్టుకొని నడుస్తాం… రెడ్ కార్పెట్ ఎంట్రీ పై ఎన్టీఆర్ కామెంట్స్ వైరల్!

Jr NTR: ఇండియాలో ప్రతి ఒక్కరు చూపు రేపు లాస్ ఏంజల్స్ లో జరగబోయే ఆస్కార్ వేడుకలపైనే ఉంది. 95వ ఆస్కార్ అవార్డు వేడుకలలో భాగంగా మన తెలుగు సినిమా ఆస్కార్ నామినేషన్స్ లో ఉండడంతో తప్పకుండా ఈ సినిమాకు ఆస్కార్ రావాలని ప్రతి ఒక్కరు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమాలో నటించిన ఎన్టీఆర్ రామ్ చరణ్ ఇద్దరూ కూడా ఇప్పటికే అమెరికాలో పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు.

తాజాగా ఎన్టీఆర్ అట్ ది ఆస్కార్ అనే ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన రెడ్ కార్పెట్ పై నడపడం గురించి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. తమకు ఇలాంటి అవకాశం వచ్చినందుకు చాలా గర్వంగా ఉందని ఎన్టీఆర్ తెలియజేశారు. ఇలా ఆస్కార్ వేడుక రోజు తాము కొమరం భీం పాత్రలో రెడ్ కార్పెట్ పై నటుడిగా నడవనని తెలిపారు..

ఇలా రెడ్ కార్పట్ పై యావత్ భారతదేశాన్ని తన గుండెల్లో పెట్టుకొని రెడ్ కార్పెట్ పై నడుస్తానని ఇలా ఒక భారతీయుడుగా రెడ్ కార్పెట్ పై నడవడం తనకు చాలా గర్వంగా ఉందంటూ ఈ సందర్భంగా ఎన్టీఆర్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇకపోతే ఎన్టీఆర్ నాటు నాటు పాట గురించి కూడా కొన్ని విషయాలు మాట్లాడారు. ఈ పాట షూటింగ్ కోసం తాము చాలా కష్టపడ్డామని తెలిపారు.

Jr NTR: ఈ పాట కోసం చాలా కష్టపడ్డాం…


ఈ పాట షూటింగ్ కు వారం రోజులు ముందు నుంచి రిహార్సల్స్ చేస్తున్నామని షూటింగ్ మధ్యలో ఉన్న గ్యాప్ లో కూడా రిహార్సిల్స్ చేస్తూ ఈ పాట కోసం చాలా కష్టపడ్డామని ఎన్టీఆర్ తెలియజేశారు. ఇలా ఎంతో కష్టపడినా ఈ పాటకు నేడు సరైన ప్రతిఫలం దక్కుతుందన్న సంతోషం ప్రతి ఒక్కరికి ఉంది.తప్పనిసరిగా ఈ పాటకు ఆస్కార్ అందుకొని చిత్రబృందం స్వదేశానికి తిరిగి వస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago